
మట్టి మేలు తలపెట్టి..!
మంచిర్యాలఅర్బన్: సంప్రదాయంగా వస్తున్న పండుగలను ప్రస్తుతం జరుపుకునే విధానంలో చేస్తున్న పొరపాట్లు పర్యావరణానికి ఎన్నో అనర్థాలు తెచ్చి పెడుతున్నాయి. వినాయక చవితి రోజు చేస్తున్న పొరపాట్లు చీకట్లు మిగుల్చుతున్నాయి. కానీ.. వినాయక చవితి అనగానే ఆకర్షణ, హంగు, ఆడంబరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్నేళ్లుగా రంగుల వినాయకులకు తీసిపోకుండా వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా మట్టి గణపయ్యలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కులవృత్తులు కాపాడుతూ.. ఉపాధినిస్తూ
కనుమరుగవుతున్న కులవృత్తిని కాపాడాలనే సదుద్దేశంతో మట్టి వినాయకుల తయారీతో పాటు ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన నాగపూరి రాజేంద్రప్రసాద్ మంచిర్యాలలోని సున్నబట్టివాడలో నివాసం ఉంటున్నారు. ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన ఆయన కులవృత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ఆలోచన చేశారు. 2015లో ఏడు మట్టి విగ్రహలు తయారీ చేసి విక్రయించారు. 2018లో 52 మట్టి ప్రతిమలను రూపొందించి పర్యావరణ హితానికి నడుం బిగించారు. ప్రస్తుతం శ్రీగణేష్ క్లే వర్క్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 80 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. మున్ముందు దీపావళికి ఉపయోగించే ప్రతిమలు, ఇంట్లో వినియోగించే మట్టిపాత్రలు, కుండలు ఇలా అన్ని రకాలు తయారీ చేయాలని నిర్ణయించారు.
మట్టివిగ్రహాలతో ఆదాయం భళా..
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల తయారీ సరఫరా టెండర్ దక్కించుకున్నారు. 40వేల వినాయకులు సరఫరా చేయనున్నారు. మరోవైపు రెండో అన్నవరంగా పేరొందిన గూడేం సత్యనారాయణ టెంపుల్‌లో ఏర్పాటు చేసే మట్టి వినాయకుడు ఇక్కడే తయారు చేశారు. ఆదిలాబాద్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ 2వేల మట్టి వినాయకుడు ఆర్డర్ ఇచ్చింది. ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టి వినాయకులు తయారు చేశారు. వినాయకుల తయారీలో కర్ర, మట్టి, గడ్డితో తడి సున్నం, వాటర్ కలర్‌లు విని యోగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర భుత్వం పర్యావరణంతోపాటు కులవృత్తులను ప్రో త్సహించటానికి ప్రభుత్వ స్థలం లీజుకు ఇస్తే మరింత మందికి ఉపాధినిస్తానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
తాతల కాలం నుంచి..
తాతల నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని మట్టి వినాయకులు తయారీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మంచిర్యాలకు చెందిన తాళ్లపల్లి తిరుపతి. ఇంటర్ పూర్తి చేసి కులవృత్తి మట్టికుండల తయారీలో తర్ఫీదు పొందాడు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో ఏటా 2వేల విగ్రహాలకు పైన మట్టి విగ్రహాలు తయారు చేసి ఆర్డర్‌పై ఇస్తుంటాడు. మూ డు కుటుంబాలు మట్టి వినాయకుల తయారీలో పాలు పంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలను చూడముచ్చటగా తీర్చిదిద్ది మార్కెట్లో విక్రయిస్తుంటా రు. మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుంద ని, విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినయోగంతో పూడిక సమస్య తొలగిపోతందుని అందుకే మట్టికి ప్రాధాన్యం ఇస్తున్నామని తిరుపతి తెలిపారు. వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగని, మట్టితో పూజించాలని సూచించారు.

మట్టి మేలు తలపెట్టి..!