
‘కొత్త’ పోస్టులు
కైలాస్‌నగర్: జిల్లా పాలనలో రెవెన్యూదీ కీలకపా త్ర. భూ సంబంధిత సమస్యలతోపాటు కుల, ఆదా య ధ్రువీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాల అ మలుకు సంబంధించిన క్షేత్రస్థాయి విచారణ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత ఈ శాఖదే. ఇంతటి కీలకమైన రెవెన్యూ సేవలను ప్ర జలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో మూడు మండలాలను ఇటీవల ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి బోథ్ మండలంలోని సొనాలను, జైనథ్ మండలంలోని భోరజ్ ను, ఆదిలాబాద్‌రూరల్, బేల, జైనథ్ మండలాలో ్ల ని పలు గ్రామాలను కలిసి సాత్నాలను ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేసింది. ఈ మండలాలన్నీ ఈ ఏడాది ఫిబ్రవరి 5నుంచి అమలులోకి రాగా తహసీల్దార్ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యా యి. ప్రత్యేకంగా మండలాలు ఏర్పడినప్పటికీ వాటి కి ఇప్పటివరకు కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో పూర్వ మండలాల్లోని అధికారులు, సి బ్బందిని సర్దుబాటు చేసి ఆర్నెళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఈక్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేయడంతోపాటు ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటికి ప్రత్యేక పోస్టులు మంజూరు చేసింది.
మూడు మండలాలకు 38..
మూడు కొత్త మండలాల పరిధిలో 38 పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జా రీ చేసింది. వాటిని భర్తీ చేస్తే ప్రజలకు రెవెన్యూ సే వలు మరింత సులభతరం కానున్నాయి. కొత్తగా ముగ్గురు తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసీ ల్దార్లతో పాటు అదనంగా 32 వివిధ కేటగిరీల పో స్టులు మంజూరయ్యాయి. వీటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారా.. లేక పరీక్షలు నిర్వహించి కొత్తవారిని నియమిస్తారా.. లేదా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న వారితో తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారా? అనేది ప్రస్తుతం ఆ శాఖతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త మండలాలకు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులోకి రానుండటంపై ఆయా మండలవాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.