
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటా లని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీ డల అధికారి పార్థసారథి క్రీడాకారులకు సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్జీఎఫ్‌ఐ జిల్లాస్థాయి సుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్ ఎంపిక పోటీలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఐకమత్యంతో ఆడి రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజేతలుగా నిలువాలని ఆకాంక్షించా రు. ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడే రామేశ్వర్ మాట్లాడుతూ.. అండర్–15 ఫైనల్‌లో జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ జట్టు 3–2 గోల్స్ తేడాతో తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన జట్టుపై విజయం సాధించినట్లు వివరించారు. అండర్–17 ఫైనల్‌లో ఇచ్చోడ జెడ్పీఎస్ ఎస్ జట్టుపై 1–2 గోల్స్ తేడాతో ఇచ్చోడ గిరిజన బాలుర గురుకుల పాఠశాల జట్టు విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ జట్లు ఈనెల 25, 26 తేదీ ల్లో సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. పోటీల కన్వీనర్ కోటోజీ చంద్రశేఖర్, డాక్టర్ ఎండీ ఖాసీం, బ్యాడ్మింటన్ కోచ్ కభీర్ దాస్, పీడీలు వినోద్‌రెడ్డి, పోచన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.