
గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
కైలాస్‌నగర్: జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినా యక చవితి ఉత్సవ శాంతియుత సమన్వయ కమి టీ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ని ర్వహించారు. కమిటీ సభ్యుల నుంచి తొలుత అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ.. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంతో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. శో భాయాత్ర పొడవునా ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుక వెంటవెంటనే వస్తున్నాయని భద్రతాపరంగా ఎ లాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌శాఖ 8712481799, వైద్యారోగ్యశాఖ 9491103108 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేపు అధికారికంగా ‘పొలాల’ వేడుకలు
ఏడాది పాటు రైతన్నలకు పంట సాగులో అండగా నిలిచే బసవన్నలను పూజించే పొలాల అమావాస్య వేడుకలను ఈ నెల 23న అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజార్షి షా ఓ ప్రకటనలో తెలిపా రు. తాంసి మండల కేంద్రంలో నిర్వహించనున్న వే డుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.