
పంట నష్టపోయిన రైతులకు పరిహారం
బేల: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం మంజూరు చేస్తామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. గురువారం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలైన మండలంలోని గూడ, మణియార్‌పూర్ రెవెన్యూ గ్రామాల శివారుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి, సోయా, కంది తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దెబ్బతిన్న పంటలను త్వరలోనే వ్యవసాయాధికారులు పరిశీలిస్తారని, స ర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని చెప్పా రు. రైతులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల తెలిపారని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు గిమ్మ సంతోష్‌రావు, సామ రూపేశ్‌రెడ్డి, నాక్లే రాందాస్, గావుండే ఘణేశ్యాం, ఠాక్రే సాగర్, విపిన్, అవినాష్, సూర్యభాన్, కరీం తదితరులున్నారు.