
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చాందా (టీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 11వ జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలను పాఠశాల హెచ్‌ఎం పండరీనాథ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. మహేందర్ జోషి, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ రాజేశ్, యూటీఎఫ్ సెక్రెటరీ లచ్చారాం, వెయిట్ లిటిల్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ వీజీఎస్ జ్యోతిష్యరన్, భాస్కర్, అఖిలేశ్, ప్రమోద్, సాయికిరణ్, సత్యనారాయణ, రాకేశ్, సౌమ్య, మా జిద్, హరీశ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.