
విగ్రహాల తయారీలో నిమగ్నం
కాగజ్‌నగర్‌టౌన్: వినాయక చవితి సమీపిస్తుండడంతో కాగజ్‌నగర్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మట్టి విగ్రహాల తయారీ ఊపందుకుంది. పట్టణంలోని పెట్రోల్‌పంప్ ఏరియా, మార్కెట్, మండలంలోని నజ్రుల్‌నగర్, రాంనగర్, విలేజ్‌నెం 5, చింతగూడ గ్రామాల్లో మట్టి వినాయకుల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు.
చిన్ననాటి నుంచే ఆసక్తి
చిన్ననాటి నుంచే విగ్రహాల తయారీపై ఆసక్తితో చిన్నచిన్న గణపతులను తయారు చేసి ఇంట్లో పూజించేవాళ్ళం. 23 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నా. భక్తులను ఆకర్షించేలా వివిధ డిజైన్లలో, హనుమంతుడిపై వినాయకుడు, రామసేతు వినాయకుడులాంటి రూపాల్లో బంకమట్టి, సహజ సిద్ధమైన రంగులతో 5 నుంచి 20 ఫీట్ల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నా. ఈ ఏడాది ఇందిరా మార్కెట్ భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నా.
– గౌత్రే విక్రమ్, కళాకారుడు, కాగజ్‌నగర్
పర్యావరణ పరిరక్షణకు..
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను తయారు చేస్తున్నా. వినాయకుడి విగ్రహాలతో పాటు దుర్గాదేవి విగ్రహాలను కూడా తయారు చేస్తా. పదోతరగతి తర్వాత మట్టి విగ్రహాలను ఇంట్లో తయారు చేసేవాడిని. ఇప్పుడు 12 ఫీట్ల వరకు వినాయ విగ్రహాలను తయారు చేస్తున్నా. పట్టణంలోని త్రినేత్ర శివాలయంలో వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టిస్తాం
– ములుకుట్ల జశ్వంత్,
ఆదర్శనగర్, కళాకారుడు

విగ్రహాల తయారీలో నిమగ్నం

విగ్రహాల తయారీలో నిమగ్నం