
పంట నష్టంపై ఆరా..
జిల్లాలో వర్షాల నేపథ్యంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈమేరకు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధిత రైతులతో
మాట్లాడారు. పంట నష్టంపై ఆరా తీశారు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..: ఎమ్మెల్యే శంకర్
సాత్నాల: భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించాల ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భోరజ్ మండలంలోని కేదార్పూర్, అకోలి, గిమ్మ, కొరటా, మాండగాడా, పూసాయి, పిప్పర్‌వాడ గ్రా మాల్లో ఆయన పర్యటించారు. ఎడ్ల బండిపై వాగులు దాటుతూ నీట ము నిగిన పంట చేలను పరిశీ లించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు సాత్నాల, మరో వైపు పెన్‌గంగ ఉధృతి కారణంగా జిల్లాలో దాదా పు 12వేల ఎకరాల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అలాగే ఎరువులు సైతం తడిసి ముద్దయ్యాయని, దీంతో రైతులు నష్టపోయారన్నారు. జిల్లాలో పంట నష్టం వి వరాలను త్వరలోనే కేంద్ర మంత్రులకు తెలియజేస్తానన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాథో డ్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఏవో అష్రఫ్, బీజేపీ నాయకులు తదితరులున్నారు.