
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కై లాస్‌నగర్: జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణం, ఇచ్చోడ, జైనథ్, గుడిహత్నూర్ మండలాలకు చెంది న మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ స మితి సభ్యులతో సోమవారం స్థానిక తానిషా గా ర్డెన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మండపాల ని ర్వహణ కమిటీ సభ్యులు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా బందోబస్తు, నిమజ్జన ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుందన్నారు. గ్రామాల్లో సాధ్యమైనంతవరకు ఒకే వినాయకుడిని ప్రతిష్టించి ఐక్యత చాటాలన్నారు. గతంలో ఏర్పా టు చేసిన మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. ఆయా కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. 24 గంటల పాటు ముగ్గురు వలంటీర్లు విగ్రహంతో పాటు మండపంలో ఉండాలని సూచించారు. అలాగే మండపంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి లక్కీ డ్రా నిర్వహించకూడదని, బలవంతపు చందాలు చేపట్టరాదని పేర్కొన్నారు. డీజేలకు అనుమతులు ఇవ్వమన్నారు. అత్యవసరమైతే డయల్ 100 కు సమాచారమివ్వాలని సూచించారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు బి. సునీల్‌కుమార్, కె. నాగరాజు, కె.ఫణిదర్, డి.సాయినాథ్, బండారి రాజు, ఎస్సైలు, సిబ్బంది, హిందు ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు హన్మాండ్లు తది తరులు పాల్గొన్నారు.