వర్షం తెచ్చిన నష్టం | - | Sakshi
Sakshi News home page

వర్షం తెచ్చిన నష్టం

Aug 18 2025 5:55 AM | Updated on Aug 18 2025 5:55 AM

వర్షం తెచ్చిన నష్టం

వర్షం తెచ్చిన నష్టం

నీటమునిగిన పంట పొలాలు జిల్లాలో 11వేల ఎకరాల్లో నష్టం అధికారుల ప్రాథమిక అంచనా రక్షేతస్థాయిలో సర్వేకు ఆదేశాలు లోతట్టు ప్రాంతాల్లో అధిక నష్టం

ఇచ్చోడ: రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీగా పంటనష్టం జరిగింది. చేతి కివచ్చిన పంటలు నీటమునిగి అన్నదాతలు ఆందో ళనకు గురవుతున్నారు. చేతికివచ్చిన పంటలు కళ్లెదుటే వరదనీటిలో కొట్టుకుపోతుంటే కలత చెందా రు. జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయా, మొక్కజొన్న త దితర పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 11వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. రక్షేతస్థాయిలో ఏఈవోలు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారి, ఏఈవోలు పంట పొలాల్లోకి వెళ్లి నష్టం వివరాలు సేకరిస్తున్నా రు. శనివారం భారీగా కురిసిన వర్షంతో సర్వే అంతంతా మాత్రమే జరగగా, ఆదివారం నుంచి ఏఈ వోలు పూర్తిస్థాయిలో సర్వేలో నిమగ్నమయ్యారు.

లోతట్టు ప్రాంతాల్లో అధికం

లోతట్టు ప్రాంతాల్లో అ్యధికంగా పంటనష్టం జరి గినట్లు తెలుస్తోంది. సిరికొండ మండలం చిక్‌మాన్‌ వాగు పొంగిపొర్లడంతో రాంపూర్‌, లఖంపూర్‌, సిరికొండ, కొండపూర్‌, ధర్మసాగర్‌, చిమన్‌గూడ, పోచంపెల్లి గ్రామాల్లో అత్యధికంగా పంటనష్టం జరిగినట్లు సమాచారం. ఇచ్చోడ మండలంలో గుండాల ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం ఎక్కువ కావడంతో నారాయణ్‌పూర్‌ వాగు పొంగి పొర్లడంతో సిరిచెల్మ, గుండాల గ్రామాల్లో పంటలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భీంపూర్‌ మండలంలో అంతర్గమ దన్నుర్‌, పిప్పల్‌కోటి, నిపాని గ్రామాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో వడ్డాడి, హస్నపూర్‌, పొన్నరి గ్రామాల్లో పంటలు కొట్టుకుపోయాయి. బజార్‌హత్నూర్‌ మండలం కడెం వాగు పరీవాహక గ్రామాలైన చింతలసాంగ్వి, బోస్రా, జల్లుగూడ, జాతర్ల, సుంగుగూడ, బజార్‌హత్నూర్‌ గ్రామాల్లోనూ పంటనష్టం జరిగింది.

జిల్లాలో నమోదైన వర్షపాతం

శనివారం ఉదయం 8.30నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు అధి కారులు వెల్లడించారు. భీంపూర్‌లో 75.4 మిల్లి మీ టర్లు, జైనథ్‌లో 79.0, బేలలో 60.08, గుడిహత్నూర్‌లో 128.8, ఆదిలాబాద్‌ (రూరల్‌)లో 77.8, ఆది లాబాద్‌ (అర్బన్‌)లో 99.0, మావలలో 111.2, తాంసిలో 136.6, తలమడుగులో 138.0, బజార్‌హత్నూర్‌లో 60.6, బోథ్‌లో 47.6, నేరడిగొండలో 57.0, ఇచ్చోడలో 110.8, సిరికొండలో 130.2, ఇంద్రవెల్లిలో 119.2, గాదిగూడలో 48.0, నార్నూర్‌లో 60.2, ఉట్నూర్‌ మండలంలో 43.8 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు.

పంటనష్టం సర్వేకు

ఆదేశాలు జారీ చేశాం

జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయికి వెళ్లి పంట నష్టంపై సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏఈవోలు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి సర్వే చేస్తారు. జిల్లాలో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశాం.

– శ్రీధర్‌స్వామి,

జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement