
పంటనష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
ఆదిలాబాద్‌రూరల్/సాత్నాల/బజార్‌హత్నూర్/ ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ రూరల్ మండలంలో శని వారం భారీ వర్షం కురవగా వరదనీటితో కొట్టుకుపోయిన తీన్‌నాలా ప్రాజెక్ట్ రిటర్నింగ్ వాల్‌ను ఆది వారం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ లఖిల్ మహాజన్ పరిశీలించారు. తీన్‌నాలా ప్రాజెక్ట్‌తో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, గతంలోనూ వరదనీటితో పంటలు మునిగి తీవ్రనష్టం వాటిల్లిందని కలెక్టర్, ఎస్పీకి రైతులు తెలిపారు. వెంటనే పరిహారం అందేలా చూడాలని కోరారు. కాగా, వెంటనే తెగిపోయిన రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్ట్ పరీవా హక ప్రాంతంలో వరదనీటికి దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నీట మునిగిన పంటలను ఎలా కాపాడుకో వాలో బాధిత రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా మండలంలోని పలు ప్రాంతాలను పరిశీ లించారు. సాత్నాల మండలం రేణిగూడా, దుబ్బ గూడా ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించారు. కోతకు గురైన రోడ్లు, దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. రైతులు ఎమ్మెల్యేతో తమ ఆవేదన పంచుకున్నారు. అధైర్య పడవద్దని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు భరోసా కల్పించారు. బజార్‌హత్నూర్ మండలంలోని కడెం వాగు పరీవాహక ప్రాంతంలో నీటమునిగిన పంటలను బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పరిశీలించారు. అధికా రులు వెంటనే సర్వే చేయాలని కోరారు. ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం మంజూరుకు అసెంబ్లీలో పోరాడతానని హామీ ఇచ్చారు.

పంటనష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

పంటనష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన