
జైనథ్, సాత్నాల, భోరజ్ మండలాల్లో..
జైనథ్/సాత్నాల: జైనథ్ మండల కేంద్రానికి స మీపంలోగల వాగు ఉప్పొంగి ప్రవహించగా ఇరువైపులా సుమారు 90 ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. సాత్నాల మండలంలో సుమారు 250 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ఏవో కైలాస్ జాదవ్ తెలిపారు. మాంగూ ర్లా, మామిడి గూడా, సుందరగిరి, సైద్పూర్ గ్రా మాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. భోరజ్ మండలంలో సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ఏవో అష్రఫ్ తెలి పారు. పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలైన పెండల్‌వాడ, అకొలి, డోలారా, కామాయి గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 220 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో సోయా, 40 ఎకరాల్లో కంది నీట మునిగినట్లు సమాచారం. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.

జైనథ్, సాత్నాల, భోరజ్ మండలాల్లో..