
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
కైలాస్‌నగర్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆదిలా బాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖలవారీగా తీసుకోవాల్సిన చర్య ల గురించి వివరించారు. ఆయా జిల్లాలోని రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరా లపై ఆరా తీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడితే వెంటనే పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మతులు యు ద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలిపారు. ఎగువన కు రుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్‌గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చో ట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించా రు. ఆర్‌డబ్ల్యూఎస్, హెల్త్ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. పొంగు తున్న వాగులు దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.