
ఫీవర్ సర్వే నిర్వహించాలి
కై లాస్‌నగర్: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇంటింటా ఫీవ ర్ సర్వే నిర్వహించి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని వి కలాంగుల కాలనీ, జీఎస్ ఎస్టేట్ ప్రాంతాల ను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పరిశీలించా రు. వరదలతో నష్టపోయిన ఇళ్లను పరిశీలించి బాఽధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాలనీల్లో నిర్వహించిన వైద్యశిబిరాల ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అ ధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజ లకు అందుబాటులో ఉండాలని, అవసరమైన సమాచారం ఇస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవా లని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఆర్‌ఐ యజువేందర్‌రెడ్డి ఉన్నారు.