
గొలుసు దొంగ అరెస్ట్
లోకేశ్వరం: మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం భైంసాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున తన రెండు ఎద్దులను గురువారం అబ్దుల్లాపూర్ వెళ్లేదారిలో మేపుతోంది. ఒంటరిగా ఉన్న ఆమెతో దొంగ మాయమాటలు చెప్పి మెడలో రెండు తులాల బంగారు గొలుసును చోరీ చేసి బైక్‌పై పారిపోయాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్కపూర్, అబ్దుల్లాపూర్ సీసీ పుటేజీలను పరిశీలించారు. ముధోల్ మండలంలోని ఆష్టా గ్రామానికి చెందిన పిప్పెర విజయ్‌గా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న లోకేశ్వరం ఎస్సై ఆశోక్, కానిస్టేబుల్ శ్రీనివాస్, సాయిప్రశాంత్, లక్ష్మణ్‌లను ఏఎస్పీ అభినందించారు.