
ముగిసిన తీజ్ వేడుకలు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంతోపాటు హర్కపూర్, బిక్కుతండా, ఈశ్వర్‌నగర్ తదితర తండాల్లో తీజ్ ముగింపు వేడుకలను శనివారం నిర్వహించారు. రాఖీపౌర్ణమి నుంచి ప్రారంభమైన తీజ్ వేడుకల్లో పెళ్లి కాని యువతులు గ్రామపెద్ద ఇంట్లో వెదురుబుట్టల్లో గోధుమ నారు నాటారు. 9 రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి గోధుమ నారుకు నీరు పో శారు. గోకులాష్టమి సందర్భంగా తీజ్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతులు, మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం గ్రామపొలిమేరలో వాగులో తీజ్‌లను వదిలి ఉత్సవాలు ముగించారు. గ్రామపెద్దలు చవాన్ ఉమాజీనాయక్, జాదవ్ దుదిరాం, రాథోడ్ శేవంతబాయి రోహిదాస్, జాదవ్ మీరాబాయి, సేవాలాల్ ధర్మ ప్రచారక్ ప్రేమ్ మహారాజ్, గంగారం రాథోడ్, సంతోష్ రాథోడ్ తదితరులు ఉన్నారు.