గర్భిణుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

గర్భిణుల తరలింపు

Aug 17 2025 6:31 AM | Updated on Aug 17 2025 6:46 AM

వేమనపల్లి: భారీ వర్షాలు దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం వేమనపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి రాజేష్‌ ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళ్లెంపల్లి, జాజులపేట, సుంపుటం గ్రామాలకు చెందిన కుడిమెత భారతి, శకుంతల, కుబిడె రోజును వేమనపల్లి పీహెచ్‌సీ నుంచి అంబులెన్స్‌లో చెన్నూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరద తీవ్రత పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా తరలిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇన్‌చార్జి హెల్త్‌ సూపర్‌వైజర్‌ రాంశెట్టి బాపు, ఏఎన్‌ఎం మంజుల, రాజ్యలక్ష్మి, ఈఎంటీ జనార్దన్‌, పైలెట్‌ సంపత్‌, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉరేసుకుని ఆత్మహత్య

కుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ గాండ్ల సాయినాథ్‌ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. సాయినాథ్‌కు గత 20 ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. ఇప్పటివరకు సంతానం కాలేదు. దివ్యాంగుడు కాగా, మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతుడి తండ్రి అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మతిస్థిమితం లేని వృద్ధుడు..

సిర్పూర్‌(టి): మండలంలోని నవేగాం గ్రామానికి చెందిన రాంటెంకి రుషి(60) శుక్రవారం పెన్‌గంగ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్‌ కథనం ప్రకారం.. రుషి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దహెగాం మండలకేంద్రం శివారులో పత్తి చేనులో అతని బట్టలు దొరకగా శనివారం ఉదయం పెన్‌గంగ నదిలో మృతదేహం ఆచూకీ లభ్యమైంది. పెద్దనాన్న కుమార్తె యశోదాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అడవిపంది దాడిలో వ్యక్తి మృతి

భీమిని: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావు, స్థానికులు తెలిపిన వివరాలు.. భీమిని మండలం వెంకటపూర్‌కు చెందిన దాగామ రామయ్య (70) కన్నెపల్లి మండలం సుర్జాపూర్‌ శివారులో శనివారం పత్తి చేనుకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో అడవి పంది దాడిలో అతడు గాయపడ్డాడు. పక్క చేనులో ఉన్న రైతులు గట్టిగా కేకలు వేయగా అది పరిగెత్తింది. రామయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అక్కడి నుంచి వెళ్లిన అడవి పంది గురుండ్ల చిరంజీవి, మేకల బాపులపై దాడి చేసి గాయపర్చింది. మృతుడి కుమారుడు రాజేశం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇద్దరు మైనర్లపై కేసు

ముధోల్‌: మండలంలోని గురుకుల పాఠశాల కు చెందిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులపై శనివా రం కేసు నమోదైనట్లు ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 8వ తరగతి, టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు శుక్రవారం రా త్రి సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు ఉండగా మైక్‌ విషయంలో గొడవపడ్డారు. ఇద్దరు మైక్‌ దాచిపెట్టగా ఈక్రమంలో గొడవ జరిగింది. ఇద్దరిని కొట్టడంతో గాయాలయ్యా యి. విషయం తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకున్నారు. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గర్భిణుల తరలింపు1
1/1

గర్భిణుల తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement