
చోరీ కేసులో ముఠా నాయకుడి అరెస్టు
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. చౌహాన్ రవి, సుఖ్‌దేవ్, షోహెల్, మైకల్వర్ సాయినాథ్, అమ్ము, కరణ్‌లు ముఠాగా ఏర్పడి రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఇందులో సాయినాథ్‌ను ఈనెల 12న పీటీ వారెంట్‌పై హాజరుపర్చగా, ఈనెల 14న సుఖ్‌దేవ్, పరారీలో ఉఉన్న ప్రధాన నిందితుడు చౌహన్ రవిని శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు షోహెల్, అమ్ము, కరణ్‌లు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి రూ. 9,500 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చౌహన్ రవిపై వివిధ పోలీస్ స్టేషన్లల్లో 25 క్రిమినల్ కేసులు, సఖ్‌దేవ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా 22కు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. దొంగలను పట్టుకున్న మావల సీఐ కర్రె స్వామి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.