
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని ఉట్నూర్ వెళ్లే రహదారిపై గురువారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన ఇంగ్వే శ్రీధర్ (24) ఓ ప్రముఖ దినపత్రిక ప్రతులను కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలించడానికి వ్యానులో బయలు దేరాడు. మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే ఓ చెట్టును ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై వాహనంలోనే మృతి చెందాడు. వ్యానులో అతనితో పాటు ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.