
ఆర్జీయూకేటీలో నషా ముక్త్ భారత్ అభియాన్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలని కళాశాల వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్సై శ్రీనివాస్ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. మా దక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమంగా రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామి అవుతామని ప్రతిజ్ఞ చేయించారు.