
‘నవోదయ’లో ప్రవేశానికి గడువు పొడిగింపు
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బు ధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు.
ఉపాధ్యాయుడు
వెంకటేశ్వర్లుకు సత్కారం
ఆసిఫాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025 కోసం బుధవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయంలో జాతీయ స్వతంత్య్ర జ్యూరీ నిర్వహించారు. కుమురంభీం జిల్లా నుంచి జన్కాపూర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్ర నుంచి 160 మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఇందులో వెంకటేశ్వర్లు ఒకరు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పాఠశాల విద్యాప్రగతిని, విద్యార్థుల ప్రగతిలో వినూత్న సేవలను వివరించారు. అనంతరం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు మదన్‌మోహన్, ఆర్‌జేడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.