
పోలీస్ గ్రీవెన్స్‌కు 43 అర్జీలు
ఆదిలాబాద్‌టౌన్: ప్రజాసమస్యలపై పోలీసు అధి కారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పరి ష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఆయన వాటిని స్వీకరించి ఫోన్ ద్వారా సంబంధితాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. దూరప్రాంతాల వారు వాట్సాప్ ద్వారా తమ సమస్యలను 8712659973నంబర్‌పై తెలియజేయవచ్చ ని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.