రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం మండలంలోని అర్లి (బి), లాండసాంగ్వి, చాందా (టి), తంతోలి, మావల మండలంలోని సరస్వతీ నగర్‌లో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి (బి)లో విత్తనాల దుకాణం, చాందా (టి)లోని వ్యవసాయ సహకార కార్యాలయాన్ని సందర్శించి ఎరువుల నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు.


