రాష్ట్ర అభివృద్ధికి అండగా కేంద్రం
ఆదిలాబాద్: తెలంగా ణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సో మవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సాధిస్తే తమ బతుకులు మారుతాయనుకున్న ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, వేదవ్యాస్, లాలమున్నా, దయాకర్, జోగు రవి, రవి రెడ్డి, జ్యోతి, స్వప్న, సాయి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


