సమస్యల పరిష్కారానికి చర్యలు●
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలు ప రిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 40 మంది అర్జీదారులు ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు.ఆయన సంబంధిత పోలీసు అధికా రులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాల ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ సమస్యను పరిష్కరించినప్పుడే పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
నేడు ఉమ్మడి జిల్లాస్థాయి హాకీ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రి యదర్శిని స్టేడియంలో మంగళవారం ఉమ్మ డి జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలి పారు. అర్హులైన క్రీడాకారులు స్టేడియంలో శిక్షకులు జే.రవీందర్, వై.శేఖర్, పి.శ్రీనివాస్, మహమ్మద్, అశోక్, అతుల్, గోవింద్ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.


