బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా..

Apr 28 2025 12:14 AM | Updated on Apr 28 2025 12:14 AM

బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా..

బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా..

8లోu

కైలాస్‌నగర్‌: మండుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు ప్రమాదఘంటికలను మోగిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో 18 నుంచి 20 మీటర్ల లోతు వరకు నీటిమట్టం పడిపోయింది. ప్రస్తుతం 150 నుంచి 300 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే కానీ నీరు పడని పరిస్థితి. మరి కొన్నిచోట్ల అంతకు మించి వేయాల్సిన దుస్థితి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో భూగర్భజలాల సంరక్షణపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ దృష్టి సారించింది. వర్షపునీటిని ఒడిసిపట్టి సంరక్షించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ నిధులతో బోర్‌వెల్‌ రీచార్జి స్ట్ర క్చర్స్‌ (భూగర్భ జల పెంపు నిర్మాణాలు), రూప్‌ టాప్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్స్‌(పైకప్పు నీటి సంరక్షణ నిర్మాణాలు), ఫాం పాండ్స్‌(నీటికుంటలు), కమ్యూనిటీ ఫోక్‌ఫిట్స్‌ (సామాజిక ఇంకుడుగుంతలు) నిర్మించేందుకు సంకల్పించింది. 2025– 26 సంవత్సరానికి గాను ఆయా నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటిని సద్వినియోగం చేసుకుని లక్ష్యం మేరకు నిర్మాణాలు చేపట్టినట్లేతే భూగర్భజలాలను సంరక్షించిన వారమవుతామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

బోర్‌వెల్‌ రీచార్జి స్ట్రక్చర్స్‌..

వర్షపునీటితో పాటు ఇతర భూమిపై ఉన్న నీటిని సంరక్షించేలా ఇప్పటికే ఉన్న బోర్‌వెల్స్‌ వద్ద నీటి ని లోనికి మళ్లించడం ద్వారా భూగర్భజలాల ను తిరిగి నింపేందుకు ఇవి తోడ్పడుతాయి. ఈ ఏడా ది జిల్లా వ్యాప్తంగా 240 స్ట్రక్చర్స్‌ నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 85 మంజూరు చేశా రు. ఒక్కో స్ట్రక్చర్స్‌ను రూ.25వేలతో నిర్మించుకునే అవకాశముంది. ఇప్పటి వరకు ఆరు నిర్మాణాలను గ్రౌండింగ్‌ చేశారు.

ఫాంపాండ్స్‌

పంటచేలల్లో నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి కుంటలను నిర్మిస్తారు. వీటినే ఫాంపాండ్స్‌ అని పిలుస్తారు. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చే సుకోవడం ద్వారా వేసవిలో పంటలకు నీరందించేందుకు తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా 392 నిర్మించాలని నిర్ణయించిన అధికారులు 332 మంజూరు చేశారు. అందులో 94 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కోదానికి రూ.2.50లక్షల ఉపాధి నిధులు వెచ్చిస్తారు.

కమ్యూనిటీ సోక్‌పీట్స్‌..

గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని చేతిపంపుల వద్ద వీటిని నిర్మించనున్నారు. జిల్లాలో కమ్యూనిటీ సోక్‌పిట్స్‌ నిర్మాణలక్ష్యం 183 కాగా 45 మంజూరు చేశారు. ఒక్కో దాన్ని రూ.12వేల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఏడు గ్రౌండింగ్‌ చేశారు. మిగతా వాటిని ఈ ఆర్థికసంవత్సరంలో పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు. వీటి నిర్మించడం ద్వారా వర్షపునీటితో పాటు చేతిపంపుల నుంచి వచ్చే వృథానీటిని తిరిగి భూమిలోకి ఇంకేలా చేస్తాయి.

రూప్‌టాప్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్స్‌

వర్షాకాలంలో భవనాలపై పడే నీటిని నిల్వచేసేందుకు ఈ స్ట్రక్చర్స్‌ తోడ్పడనున్నాయి. గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 31చోట్ల నిర్మించాలని నిర్ణయించగా ఇందులో 8 మంజూరు చేశారు. ఒక్కోదాన్ని రూ.25వేలతో నిర్మిస్తారు. ఇప్పటి వరకు ఒకటి పూర్తి చేశారు. ఆయా కార్యాలయాలపైపడిన వర్షపునీరు వృథాగా పోకుండా భూ మిలోకి ఇంకించేలా ఈ స్ట్రక్చర్‌ నిర్మించనున్నారు.

భూగర్భజలాల పెంపుపై ఫోకస్‌

నీటి కుంటలు, ఇంకుడుగుంతలు మంజూరు

ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు

సద్వినియోగం చేసుకుంటే జల సంరక్షణకు దోహదం

భూగర్భ్బజలాల పెంపునకు చర్యలు

జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పలుచోట్ల బోరుబావులు, చేదబావులు ఎండిపోయాయి. నీటిని సంరక్షించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా భూగర్భజలాలను పెంపొందించేలా ఉపాధి నిధులతో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈమేరకు లక్ష్యాలను నిర్ణయించాం. వందశాతం సాధించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– రాథోడ్‌ రవీందర్‌, డీఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement