
క్రీడా శిక్షణకు వేళాయే
జిల్లావ్యాప్తంగా క్రీడా శిబిరాల వివరాలు..
ఆదిలాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏటా వేసవిలో ప్ర త్యేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. విద్యార్థులు ఆయా క్రీడాంశల్లో ఆసక్తి పెంపొందించడంతో పాటు వారు రాణించేలా నెల రోజుల పాటు ప్రత్యే క శిక్షణ అందజేస్తోంది. అర్హత కలిగిన శిక్షకుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించి ఎంపిక చేసింది. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో శిక్షణ అందించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శిక్షకులకు సామగ్రి సైతం అందజేశారు.
34 శిక్షణ కేంద్రాల్లో..
ఈ ఏడాది జిల్లాలోని 34 కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 25మంది , పట్టణ ప్రాంతాల్లో 9మంది శిక్షకులు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు. మే1నుంచి 31వరకు బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్ క్రీడలతో పాటు హాకీ, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి అవుట్ డోర్ క్రీడల్లో సైతం శిక్షణ కల్పించనున్నారు. ఇప్పటికే శిక్షకులకు క్రీడా సామగ్రి సైతం అందించారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందది. సుమారు 1000 మంది వరకు బాలలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అర్హులు ఎవరంటే..
శిబిరాల్లో 14 ఏళ్లలోపు బాల, బాలికలకు మాత్రమే శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు అర్హులు ఈనెల 27వరకు https:// forms. gle/ xAtXkCvSJgzdpidS7 ఆన్లైన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి ఎంపిక చేసుకున్న క్రీడాంశంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తారు.
విధి, విధానాలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 10 శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొంతమంది స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. శిక్షకుడికి రూ.4వేల గౌరవ వేతనంతోపాటు క్రీడా సామగ్రి కొనుగోలు నిమిత్తం మొత్తం రూ.50వేలు మంజూరు చేసింది.
మే 1నుంచి వేసవి శిబిరాలు
పలు క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ
శిక్షకులకు ఇప్పటికే సామగ్రి పంపిణీ
జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు
ఈనెల 27వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్
గ్రామీణ ప్రాంతాల్లో..
క్రీడాంశం శిబిరం ఇన్చార్జి క్యాంప్ స్థలం సెల్ నంబర్ అథ్లెటిక్స్ రాకేశ్ బెల్లూరి 97049 44283
అథ్లెటిక్స్ జి.సునంద్ ఉట్నూర్ 99894 03069
అథ్లెటిక్స్ పి.రాజేశ్ చాందా(టి) 94921 36510
ఆర్చరీ మారుతి/రవీందర్ చించుఘాట్ 94914 68654
హాకీ శేఖర్ ఉట్నూర్ 80089 71963
హాకీ జె.రవీందర్ భరంపూర్ 96669 07755
హాకీ షేక్ షబ్బీర్ మర్లపల్లి 81211 75659
వాలీబాల్ దయాకర్ కేస్లాపూర్ 93811 59116
వాలీబాల్ పిసారాం నందిగావ్ 81215 35200
వాలీబాల్ మహేందర్ నార్నూర్ 91829 45202
వాలీబాల్ జైతు గుంజాల –– వాలీబాల్ శ్రీనివాస్ మాన్కపూర్ 72076 91916
వాలీబాల్ అఖిలేష్ చాందా(టి) 96660 01285
వాలీబాల్ రామిరెడ్డి ఖాప్రి 79816 71724
వాలీబాల్ సందీప్ దుర్గానగర్ 97015 87819
వాలీబాల్ ఎన్.స్వామి భీంసరి 98487 36476
వాలీబాల్ కాంతారావు పొచ్చర 94935 34163
ఖోఖో పొచ్చన్న ఖోడద్ 97019 65056
ఖోఖో శివకృష్ణ ఉట్నూర్ 89788 10993
క్రికెట్ ఎ.మహేందర్ నార్నూర్ 91829 45202
సాఫ్ట్బాల్ జి.గంగాధర్ నేరడిగొండ 90005 65142
బేస్బాల్ పవన్ అంకోలి –– హ్యాండ్బాల్ వివేక్ గుడిహత్నూర్ 93984 34886
బ్యాడ్మింటన్ కె.మహేశ్ దుర్గానగర్ –– కబడ్డీ ఎం.విఠల్ రెడ్డి మావల 70131 70041
పట్టణ ప్రాంతాల్లో..
బాక్సింగ్ సాయికుమార్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 81065 56176
జూడో ఎన్.రాజు డీఎస్ఏ, ఆదిలాబాద్ 77803 69672
అథ్లెటిక్స్ రమేశ్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 91774 78427
హ్యాండ్బాల్ సింధు మహాలక్ష్మివాడ 63008 07110
హ్యాండ్బాల్ హరిచరణ్ తిర్పెల్లి 63008 07110
హాకీ శ్రీనివాస్ కేఐసీ, స్టేడియం 94941 48474
తైక్వాండో వీరేష్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 70122 81284
బ్యాడ్మింటన్ కబీర్దాస్ ఆదిలాబాద్ 94907 40567
రెజ్లింగ్ శ్రీధర్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 86864 26300
నెలపాటు ఉచిత శిక్షణ..
14 ఏళ్ల లోపు బాల, బాలికలకు నెల రోజులపాటు వివిధ క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ అందించనున్నాం. ఈ మేరకు శిక్షకులను ఎంపిక చేసి క్రీడా సామగ్రిని సైతం అందజేశాం. శిక్షకుల వేతనం, క్రీడా సామగ్రి కొనుగోలుకు సంబంధించి మొత్తం రూ. 50వేల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందాయి. ఈ శిక్షణను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో