చోరీ కేసులో నిందితుడి అరెస్టు
బెల్లంపల్లి: చోరీ కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం.. 2022లో టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరదీప్‌సింగ్ కొంతకాలం నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడి ఆచూకీని కనుగొని పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చాకచక్యంగా పట్టుకుని గురువారం బెల్లంపల్లి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అనంతరం ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


