విధులకు హాజరై తిరిగి కారులో వెళ్తుండగా.. విషాదం! | - | Sakshi
Sakshi News home page

విధులకు హాజరై తిరిగి కారులో వెళ్తుండగా.. విషాదం!

Mar 23 2024 1:45 AM | Updated on Mar 23 2024 12:22 PM

- - Sakshi

ఆదిలాబాద్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్‌(32)రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం విధులకు హాజరై తిరిగి కారులో ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి నిజామాబాద్‌ జిల్లా ఎర్గట్ల మండలం బట్టాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. రాజ్‌కుమార్‌ స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం సావెల్‌ గ్రామం కాగా అందరితో కలివిడిగా ఉండే డాక్టర్‌ అకాల మరణంపై కడెం పీహెచ్‌సీ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement