మందుబాబుల హల్‌చల్‌.. పార్కింగ్‌ హడల్‌..! అధికారుల పట్టింపు మాత్రం ఫుల్‌ నిల్‌..!! | - | Sakshi
Sakshi News home page

మందుబాబుల హల్‌చల్‌.. పార్కింగ్‌ హడల్‌..! అధికారుల పట్టింపు మాత్రం ఫుల్‌ నిల్‌..!!

Aug 12 2023 2:06 AM | Updated on Aug 12 2023 11:23 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: జిల్లాకేంద్రంలోని పలు వైన్స్‌ షాపుల ఎదుట మందుబాబులు హల్‌చల్‌ చేస్తున్నారు. పర్మిట్‌ రూమ్‌లు ఉన్నప్పటికీ రోడ్డుపైనే మద్యం తాగుతూ మత్తులో తూగుతున్నారు. ప్రధానంగా రోడ్లను ఆనుకొని ఉన్న వైన్స్‌ల వద్ద మహిళలు, విద్యార్థినులకు భద్రత కరువవుతోంది. ఈ దారిగుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు.

జిల్లాకేంద్రంలోని దస్నాపూర్‌, కలెక్టర్‌చౌక్‌, వినాయక్‌చౌక్‌, బస్టాండ్‌ ప్రాంతం, తెలంగాణచౌక్‌, పంజాబ్‌చౌక్‌లలో వైన్స్‌లు, బార్‌లు రోడ్డుకు ఆనుకొని ఉండడంతో మందుబాబులు రోడ్లపైనే ఇష్టారాజ్యంగా మందు తాగుతున్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement