బీజేపీ విజయానికి కృషి చేయాలి..! పాయల్‌ శంకర్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేపీ విజయానికి కృషి చేయాలి..! పాయల్‌ శంకర్‌

Jul 17 2023 1:38 AM | Updated on Jul 17 2023 7:40 AM

- - Sakshi

పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్‌: వచ్చే ఎన్నికల్లో విజయం సాఽధించేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని దేవపూర్‌, కుచులపూర్‌ గ్రామాల్లో బీజేపీ మహాజన్‌ సంపర్క్‌లో భాగంగా టిఫిన్‌ బాక్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాఽధించేలా గ్రామాల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.

అధికార పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. సమయం తక్కువగా ఉందని, ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్‌, మాజీ మంత్రి అమర్‌సింగ్‌ తిలావత్‌, లోక ప్రవీణ్‌రెడ్డి, రఘుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మానాజీ, జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి, బాబారవ్‌ పటేల్‌, జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్‌, బోథ్‌ అసెంబ్లీ కన్వీనర్‌ సూర్యకాంత్‌ గిత్తే, తలమడుగు మండల అధ్యక్షులు బోనగిరి స్వామి, ఇచ్చోడ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement