Sakshi News home page

పేదింటి చిన్నోడికి.. పెద్ద కష్టం

Published Sat, Apr 22 2023 11:47 AM

తల్లితో చిన్నారి రాహుల్‌  - Sakshi

నిర్మల్‌రూరల్‌: ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన వైశాలి, రవి దంపతుల కుమారుడు రాహుల్‌ (9 నెలలు) రక్తప్రసరణ వ్యవస్థలో ఇబ్బంది తలెత్తింది. వైద్యానికి రూ.లక్షలు కావడంతో ఆ పేద కుటుంబం ఒక్కగానొక్క బిడ్డను కాపాడుకునేందుకు అల్లాడుతోంది. వైశాలి, రవి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల తర్వాత రాహుల్‌ జన్మించాడు. ఏడు నెలల వయసులో జ్వరం రావడంతో జిల్లా కేంద్రంతో పాటు నిజామాబాద్‌లో వైద్యులకు చూపించారు.

ఎంతకీ నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిని సంప్రదించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం రాహుల్‌కు రక్తప్రసరణ వ్యవస్థలో లోపం ఉందని, తప్పనిసరిగా ఆపరేషన్‌ చేయాలని సూచించారు. ఆపరేషన్‌ ఖర్చు సుమారుగా రూ.3.50 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆపరేషన్‌కు డబ్బులు లేక తల్లడిల్లుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో తమను ఆదుకోవాలని, దాతల తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు.

సంప్రదించాల్సిన నం. 9676034110

Advertisement

What’s your opinion

Advertisement