దగ్ధమైన చెరుకుపంట
గుడిహత్నూర్: మండలంలోని తోషం గ్రామానికి చెందిన రవీందర్ పస్తాపురే చేనులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎకరంలో సాగుచేసిన చెరుకుపంట పూర్తిగా దగ్ధమైంది. దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైప్‌లైన్ కూడా కాలిబూడిదైంది. దీంతో రూ.2 లక్షల వరకు నష్టపోయినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చెరుకు పంటపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తన నష్టాన్ని ఆయా శాఖ పూరించాలని కోరారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ లైన్‌మెన్ బాలాజీ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించి రైతును ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని బాలాజీ అన్నారు.


