సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ దేవాలయంపై దుష్ప్రచారం చేసిన ఓ టీవి చానల్ స్టాఫ్ రిపోర్టర్‌పై ఆలయ అధికా రుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు న మోదు చేసినట్లు ఎస్సై కృష్ణాసాగర్‌రెడ్డి తెలి పారు. ఆయన వివరాల ప్రకారం... ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఓ టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ఆలయ నిర్మాణ పనులు చేసే జేసీబీ ఆపరేటర్, ట్రాక్టర్ డ్రైవర్లు భోజ నాలు చేసే సమయంలో వారిని బూతులు తి డుతూ వీడియోలు తీసి తన ఛానల్‌లో గర్భాలయంలో కాంట్రాక్టర్ దావత్ అని ప్రచారం చేశా డు. ఇలా ప్రచారం చేయడంతో దేవాలయ ప్ర తిష్టకు భంగం కలగడమే కాకుండా భక్తుల మ నోభావాలు దెబ్బతీశారని ఆలయ సీనియర్ అ సిస్టెంట్ రమణారావు ఫిర్యాదు చేశాడు. కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


