బెల్లంపల్లి యూనిట్‌లో 170మంది సభ్యులు ఉన్నారు. జాతీయస్థాయిలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ట్రెక్కింగ్, బైకింగ్, సైక్లింగ్, బోటింగ్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్ క్యాంప్ రకరకాలు ఉంటాయి. గోవాలో మాన్‌సూన్ ట్రెక్కింగ్, ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వెళ్లొచ్చాం. జైసల్మెర్‌లో ఫ్యామిలీ క్యాంప్‌నకు వెళ్లాం. భార్యాభర్తలు, 12ఏళ్లలో పిల్లలకు కలిపి ఒక టెంటు ఇస్తారు. నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఉండడానికి వసతి సౌకర్యం, ఆహారానికి అంతా కలిపి రూ.7వేల నుంచి రూ.8వేలు చార్జీ చేస్తారు. ఈ క్యాంప్‌లు ఊటి, కులూ, మున్నార్‌లో కూడా ఉంటాయి. గత వేసవిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని డోలారిపాస్, లడక్‌లో మోటార్‌సైక్లింగ్‌కు వెళ్లాం. హిమాచల్‌ప్రదేశ్‌లో డలౌ్‌హ్‌సి ట్రెక్కింగ్‌కు వెళ్లాం. సైక్లింగ్‌కు వెళ్లినప్పుడు సైకిల్ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఉత్తరాఖండ్ వంటి ప్రాంతానికి వెళ్లినప్పుడు స్థానిక వాతావరణానికి అలవాటు పడడానికి చిన్న చిన్న ప్రదేశాలకు తీసుకెళ్తారు. తిరుమల తిరుపతి అడవుల్లో కూడా ఒక ట్రెక్కింగ్ నిర్వహిస్తారు. కపిలతీర్థం, రామకృష్ణ తీర్థం కూడా చూడవచ్చు. జాతీయ స్థాయిలో వెళ్లిన ట్రెక్కింగ్‌లకు రాజస్థాన్, గుజరాత్, గోవా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్నేహితులయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 50కిలోమీటర్ల పరిధిలో పది నుంచి 12 జలపాతాలు ఉన్నాయి. అటవీశాఖ అధికారుల సహకారంతో నాలుగు రోజుల కార్యక్రమం ఆగస్టు తర్వాత నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం.
–శ్యాంసుందర్‌రెడ్డి, వైహెచ్‌ఏఐ తెలంగాణ వైస్‌ప్రెసిడెంట్, మంచిర్యాల


