ఆ కిక్కు వేరేలా ఉంటుంది: ‘దిల్‌’ రాజు | Gunasekhar Euphoria Striking Glimpse unveiled by Dil Raju | Sakshi
Sakshi News home page

ఆ కిక్కు వేరేలా ఉంటుంది: ‘దిల్‌’ రాజు

Oct 8 2024 12:04 AM | Updated on Oct 8 2024 12:04 AM

Gunasekhar Euphoria Striking Glimpse unveiled by Dil Raju

‘‘గుణశేఖర్‌గారి మొదటి చిత్రం ‘లాఠీ’ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన ఎన్నో విజయాలు, పరాజయాలు చూశారు. ఫెయిల్యూర్స్‌ తర్వాత వచ్చే సక్సెస్, ఆ విజయం ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. కొత్తవాళ్లతో ఆయన తీస్తున్న ‘యుఫోరియా’ మూవీ పెద్ద హిట్‌ అవ్వాలి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. డైరెక్టర్‌ గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రల్లో, నటి భూమిక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రం గ్లింప్స్‌ను నిర్మాతలు ‘దిల్‌’ రాజు, కేఎల్‌ దామోదర ప్రసాద్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. వాటి స్ఫూర్తితో ‘యుఫోరియా’ కథ అనుకున్నాను. ఈ కథని నా కుమార్తె నీలిమకు చెబితే.. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని చెప్పింది. యూత్, పేరెంట్స్‌ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో తొంభై శాతం కొత్త వాళ్లే కనిపిస్తారు. ఇప్పటి వరకు అరవై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ‘‘చక్కగా తెలుగు మాట్లాడే వాళ్లని, థియేటర్‌ ఆర్టిస్టుల్ని ఈ సినిమాకు తీసుకున్నాం’’ అన్నారు నీలిమ గుణ. ‘‘గుణశేఖర్‌గారి దర్శకత్వంలో ‘యుఫోరియా’ లాంటి మంచి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని విఘ్నేష్, శ్రీనిక రెడ్డి, పృథ్వీ రాజ్, లిఖిత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement