breaking news
Sajid
-
మార్చురీలోనే సాజిద్ మృతదేహం
తోటి వ్యక్తుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న సాజిద్‌ను తాను క్షమించనని.. ఆ డెడ్‌బాడీని తాను చూడనని.. అంత్యక్రియలు చేయనని... పోలీసులకు స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ముష్కరదాడి కింగ్‌పిన్ సాజిద్ భార్య వెర్నా. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోండీ ముష్కర కాల్పుల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే.ఆ కాల్పులు జరిపి 16మందిని పొట్టన పెట్టుకున్న సాజిద్ అక్రమ్‌ను అదే రోజు పోలీసులు కాల్చి చంపేశారు. అయితే డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్లమని సాజిద్ కుటుంబీకులను, భార్య వెర్నాను పోలీసులు కోరినా.. ఆమె మాత్రం భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేయడానికి నిరాకరించింది. దీంతో సాజిద్ అంత్యక్రియలు చేయడానికి ఆస్ట్రేలియా పోలీసులే సిద్ధమవుతున్నారు.ఏం జరిగింది ఆరోజుడిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని బోండిలోని చనుకా బై ది సీ ఈవెంట్ పై ఒక్క సారిగా విరుచుకు పడ్డ సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ ఉగ్రదాడి కారణంగా ఒక్కసారిగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న ఈవెంట్ ఒక్కసారిగా మారణహోమంగా మారిపోయింది. క్షణాల వ్యవధిలో 16మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.సుమారు 100 మంది గాయాల బారిన పడ్డారు. ధైర్యం చేసిన మరో స్థానికుడు అహ్మద్ ధైర్య సాహసాలు ప్రదర్శించి... తూటాలకు భయపడకుండా సాజిద్‌ను ఎదుర్కొని ప్రాణనష్టాన్ని నివారించగలిగాడు. అప్పట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు సాజిద్‌ను కాల్చి చంపేయడం.. అతని కుమారుడు నవీద్‌ను అదుపులోకి తీసుకోవడంతో డెత్‌గేమ్‌కు ఫుల్స్టాప్ పడింది. మారణకాండ గురించి తెలుసుకున్న ప్రపంచ దేశాలు తీవ్రవాద ఘటనను ఖండించాయి.నవీద్‌పై 59 కేసులుఆ తర్వాత పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. మారణహోమాన్ని సృష్టించిన సాజిద్ అదే రోజు చనిపోవడంతో అతని డెడ్‌బాడీని కరోనర్ కార్యాలయంలోని మార్చురీకి తరలించి తదుపరి దర్యాప్తుపై పోలీసులు ఫోకస్ చేశారు. అక్కడి చట్ట ప్రకారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ భార్య వెర్నా మాత్రం ఆ డెడ్‌బాడీని తాను తీసుకెళ్లనని స్పష్టం చేసింది. ఈ తీవ్రవాద ఘటనలో ప్రధాన పాత్ర పోషించి పోలీసుల కాల్పుల్లో మరణించిన సాజిద్ కుమారుడు 24ఏళ్ల నవీద్ మాత్రం ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు.అతన్ని విచారించిన ఆస్ట్రేలియా పోలీసులు అతనిపై మొత్తం 59 కేసులు నమోదు చేశారు. వీటిలో 16 హత్య కేసులు, ఉగ్రవాద చర్యకు పాల్పడిన కేసుతో పాటు తీవ్రవాద కార్యకలాపాలు, ఇతర కేసులున్నాయి. విచారించగా... తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు, ఐసిస్ నుంచి ప్రేరణ పొందినట్లు నవీద్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో అనే ద్వీపంలో 1990 నుంచి ఐఎస్ తీవ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు సమాచారం.దూరమైన బంధువులుఅంతటి ఘోరానికి పాల్పడ్డ సాజిద్ గురించి హైదరాబాద్‌లోని కుటుంబీకులు సైతం అతని మరణంపై ఎలాంటి సంతాపం వ్యక్తం చేయడం లేదు. సాజిద్ ఇప్పుడు కాదు... 1998లోనే దూరమయ్యాడని... తాజా ఉదంతం కారణంగా అతను మరింత దూరమయ్యాడని చెబుతున్నారు. అతనిలో అంతటి రాక్షసత్వం ఉందని... అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని టోలీచౌకీలో నివాసముంటున్న అతని వృద్ధ తల్లి, సోదరుడు చెబుతున్నారు.ఆస్తులు కూడ బెట్టిన సాజిద్తీవ్రవాదం జీర్ణించుకున్న సాజిద్ గతంలోనే భార్యతో కూడా దూరమయ్యాడట. అయితే ఘటనకు ఆరు నెలల ముందు నుంచి భార్యతో తిరిగి సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భార్య వెర్నా పోలీసులకు వివరించింది. అయినా భార్యతో కాకుండా కుమారుడితో కలిసి కాంప్సీ ప్రాంతంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నాడు. అంతకు ముందే భారీగా ఆస్తులు కూడబెట్టిన సాజిద్ తొలుత 7లక్షల డాలర్లకు మూడు పడకగదుల ఆస్తిని 2016లో కొనుగోలు చేసి భార్య వెర్నా పేరిట రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత 5 లక్షల డాలర్లతో మరో ఇంటిని కొనుగోలు చేశాడు. అతను మరణించిన నాటికి అతని ఆస్తుల విలువ సుమారు 2 మిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించినట్లు సమాచారం.మారణకాండకు పక్కా స్కెచ్మారణకాండ సృష్టించడానికి తండ్రీ కొడుకులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 14న సాయంత్రం7గంటల సమయంలో కాంప్సీ ప్రాపర్టీ నుండి బోండి బీచ్ కు వెళ్లారు. క్యాంప్ బెల్ పరేడ్ లో హ్యుండాయ్ ఎలాంట్రా కారును పార్క్ చేసి, వాహనం కిటికీపై ఐసిస్ జెండాను ఎగరవేశారు. బోండి బీచ్ నుండి మీటర్ల దూరంలో ఉన్న పార్కులో హనుక్కా మొదటి రోజును జరుపుకుంటున్నప్పుడు యూదు కుటుంబాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులకు చిక్కిన కొడుకు నవీద్ ఇచ్చిన ఆధారాలతో ఆ సాయంత్రం, సిడ్నీ నైరుతి ప్రాంతంలోని బోనీరిగ్ లోని ఒక ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు ఆ ఇంటిని వెర్నా, సాజిద్ లు కలిసి 2016లో కొనుగోలు చేశారని గుర్తించారు.ఇండియాలో నేర చరిత్ర లేదుహైదరాబాద్కు చెందిన సాజిద్ ఆస్ట్రేలియాకు వలస వచ్చిన తర్వాత ఆరుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లినట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత అంశాలు, అతని వృద్ధ తల్లిదండ్రులను పరామర్శించడం లాంటి కారణాలతోనే వచ్చి వెళ్లాడు. అయినప్పటికీ, అతని తండ్రి మరణించినప్పుడు అతను భారతదేశానికి రాలేదు. ఉపాధి నిమిత్తం 1998లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సాజిద్ 1999లోనే యూరప్‌కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.భారతీయ పాస్ పోర్ట్ కలిగి ఉన్న 50 ఏళ్ల సాజిద్‌కు ఇండియా నుంచి నేర చరిత్ర లేదు. అతను భారతదేశంలో రాడికలైజ్ అయ్యే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని అతని కుటుంబం కూడా అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని చెబుతున్నారు. ఇప్పటికీ మధ్యతరగతి అధికంగా ఉన్న టోలిచౌకిలోని ఓ ఇంట్లో సాజిద్ తల్లి, సోదరుడు నివాసముంటున్నారు. సాజిద్ గురించి.. అతని రాకపోకల గురించి తమకేమీ తెలియదని ఇరుగు పొరుగు వారు కూడా చెప్పడం గమనార్హం.ఫిలిప్పీన్స్‌లో నెల రోజులు తీవ్రవాద శిక్షణఅయితే తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్ లో తీవ్రవాద శిక్షణ పొందినట్లు సంకేతాలు స్పష్టం అయ్యాయి. గత నవంబర్‌లో నెల రోజల పాటు దక్షిణ ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లిన సాజిద్, నవీద్‌లో అక్కడే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ మిండనోవా అనే ద్వీపంలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. ఫిలిప్పీన్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న ఆస్ట్రేలియన్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో ద్వీపం.. 1990 దశకం నుంచే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు షెల్టర్‌జోన్‌గా మారిందని... తీవ్రవాదులు తరచూ సందర్శించే మిండనోవా ద్వీపం వారికోసం ఓ హాట్ స్పాట్ అని చెప్పవచ్చు.తండ్రీ కొడుకులిద్దరూ నవంబర్ 1న సిడ్నీ నుంచి ఫిలిప్పీన్స్ చేరుకున్నట్లు ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. మిండనావోలోని దావావో నగరానికి వెళ్లే ముందు వారు మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఇద్దరూ దావావోను తమ తుది గమ్యస్థానంగా మార్క్ చేసినట్లు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. వీళ్లిద్దరూ ఫిలిప్పీన్స్‌లో ఏ విధమైన ఉగ్రవాద శిక్షణను పొందారనే అంశాలను రాబట్టేందుకు ఫిలిప్పీన్స్ అధికారులతో ఆస్ట్రేలియా పోలీసులు చర్చలు సాగిస్తున్నారు.అయితే ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న వాదనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ తిరస్కరించారు. అయితే ఐసిస్ తో సంబంధం ఉన్న ఉగ్రవాదుల సంఖ్య కేవలం 50 మాత్రమే ఉందని ఫిలిప్పీన్స్ సైన్యాధికారి తెలిపారు. తిరిగి తండ్రీ కొడుకులు నవంబర్ 28న దావావో నుండి మనీలాకు కనెక్టింగ్ విమానంలో అక్కడి నుంచి బయలుదేరి సిడ్నీ చేరుకున్నారు. ఉగ్రవాదుల వాహనం నుండి ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన రెండు జెండాలను స్వాధీనం చేసుకున్నారు, ఐసిస్‌తో సంబంధం కలిగి ఉన్నాయనడానికి కొన్ని ఆధారాలను ఆస్ట్రేలియా పోలీసులు సేకరించారు.- మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, సాక్షి డిజిటల్ -
2012లో హైదరాబాద్‌కు సాజిద్.. 27 సార్లు ఎందుకు వచ్చాడు?
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో మారణహోమానికి తెగబడి, పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. టోలిచౌకి అల్ హనస్ కాలనీలో ఉండే అతడి కుటుంబీకులను ప్రశ్నించిన నిఘా వర్గాలు ఈ విషయం గుర్తించాయి. మరోపక్క గడిచిన 27 ఏళ్లలో అతడు నగరానికి రాకపోకలు సాగించిన అంశాల పైనా అధికారులు వివరాలు సేకరించారు. 👉నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ నుంచి బీకాం పూర్తి చేసిన సాజిద్ 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. 2000లో ఇటాలియన్ వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమె ఆ దేశంలోని పర్మనెంట్ రెసిడెంట్‌గా (పీఆర్) ఉన్నారు. దీంతో 2001లో సాజిద్ తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నారు.👉ఆ దేశ పర్మనెంట్ రెసిడెంట్‌ను వివాహం చేసుకున్నా... వారితో చట్టబద్ధంగా సహజీవనం చేస్తున్నా ఆస్టేలియా ఈ వీసాను జారీ చేస్తుంది. ఇది కలిగి ఉన్న వాళ్లకు అక్కడ ఉండే, పని చేసే, చదువుకునే, మెడికేర్ సదుపాయం పొందే హక్కులు వస్తాయి. ఆపై పీఆర్‌గా మారిన సాజిద్ 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా తీసుకున్నారు. 👉పీఆర్ హోదా ఉన్న వారికి ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చిపోయే పరిమితి ఐదేళ్ల కాలానికే ఉంటుంది. ఆ తరువాతఅవసరమైన వారు దరఖాస్తు చేసుకుని ఈ రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాల్సి ఉంటుంది. ఇలా తన పీఆర్ హోదాను సాజిద్ అక్రమ్ కొనసాగించారు. 👉ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉండాలన్నా, ఆ దేశ పాస్‌పోర్టు పొందాలన్నా, విదేశాల్లో ఆస్ట్రేలియన్ రాయబార కార్యాలయం ద్వారా రక్షణ పొందాలన్నా సిటిజన్‌షిప్ అవశ్యం. ఈ నేపథ్యంలోనే సాజిద్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి ప్రయత్నించాడని, అయితే అతడి దరఖాస్తు ప్రతి సందర్భంలోనే తిరస్కరణకు గురైందని కుటుంబీకులు చెప్తున్నారు. అందుకు కారణాలను మాత్రం అతడు ఎప్పుడూ తమతో పంచుకోలేదని పోలీసులకు వివరించారు. 👉ఇతడి కుమారుడైన మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో అక్కడి పౌరసత్వం, ఆ దేశ పాస్‌పోర్టు లభించాయి. గడిచిన 27 ఏళ్లల్లో సాజిద్ ఆరుసార్లు, అక్రమ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లారని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రాకపోకలకు గల కారణాల పైనా స్పష్టత ఇచ్చాయి. 👉2001లో తొలిసారిగా తన భార్యతో కలిసి వచ్చిన సాజిద్ ఇక్కడ కుటుంబీకుల సమక్షంలో తమ సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నారు. 2004లో కుమారుడు నవీద్‌ను టోలిచౌకీలో ఉన్న కుటుంబీకులకు చూపించడానికి తీసుకువచ్చాడు. 👉2009లో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సాజిద్... ఆ తర్వాత వచ్చి తల్లితో పాటు కుటుంబీకుల్నీ కలిసి వెళ్లాడు. వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తి అయిన శాలిబండలోని ఇంటిని విక్రయించడానికి 2016లో వచ్చి వెళ్లాడు. 👉ఈ డబ్బు వెచ్చించే ఆస్ట్రేలియాలోని బోనిరిగ్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇందులో భార్య సైతం కొంత షేర్ కలిగి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సాజిద్ తన వాటాను కూడా భార్య వెనెరా పేరుతో బదిలీ చేశాడు. 👉2022 ఫిబ్రవరిలో ఆఖరుసారిగా హైదరాబాద్ వచ్చిన సాజిద్ తన కుటుంబీకుల్ని కలిసి వెళ్లాడు. ఆ సందర్భంలోనే పదేళ్ల కాలపరిమితికి తన పాస్‌పార్ట్‌ను రెన్యువల్ చేయించుకున్నాడు. సాజిద్ వివరాలు ఇలా..1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెంట్ వీసా కోసం 27 సార్లు ప్రయత్నించిన సాజిద్.2000 సంవత్సరంలో వెన్నసాను వివాహం చేసుకున్న సాజిద్.2001లో పార్ట్నర్ వీసా మార్చుకున్న సాజిద్.2008లో రెసిడెంట్ రిటన్ వీసా పొందిన సాజిద్.27 సార్లు ప్రయత్నం తర్వాత రెసిడెంట్ రిటన్ వీసా పొందిన సాజిద్.27 ఏళ్లుగా ఇండియా రాకపోకలపై ఆరా తీస్తున్న అధికారులు.2012లో చివరిసారిగా హైదరాబాద్ రాక.నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు.అంతకుముందే.. 2018లో హైదరాబాద్‌లో ఆస్తిని అమ్మి ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుగోలు.2022 తర్వాత సాజిద్ ఇండియాకు రాలేదు. తండ్రి మరణించినా, కుటుంబంలో ఇతర శుభకార్యాలకు హాజరుకాలేదు.ఇదిలా ఉండగా.. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్‌లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలు ఉన్నాయి. -
యూదులపై కాల్పులు: అక్కడ మ్యారేజ్.. ఇక్కడ నిఖా!
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో యూదులపై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ రెండుసార్లు వివాహం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 1999లో యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడు. తొలుత అక్కడ అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నిఖా జరిగింది. వీరికి 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించగా.. అతడి 15వ ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్దిరోజులు టోలిచౌకీలో ఉండి దూద్‌బౌలీలో కొన్ని స్థిరాస్తుల్ని విక్రయించి వెళ్లినట్లు తెలిసింది. ఉగ్రవాద బాటపట్టిన సాజిద్, నవీద్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను ముందే ఊహించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సాజిద్ ఆస్తిపాస్తుల్లో తనకు ఉన్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరిలోనే వెనెరాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే ఇతడికి పరిచయమైన వారి ద్వారా ఐసిస్‌లో చేరాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు ఫిలిప్పీన్స్‌లో ఉన్న మిండానావో ఐలాండ్‌లోని ఐసిస్ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీరి కదలికలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఉదయం వీళ్లు దాదాపు 20 కిమీ ప్రయాణించి బీచ్ వద్దకు చేరుకున్నట్లు ఆధారాలు సేకరించారు. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్‌లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలను కూడా స్వాదీనం చేసుకున్నారు. -
తండ్రీకొడుకుల పనే
సిడ్నీ: ప్రశాంత ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించింది పాక్ జాతీయులైన తండ్రీకొడుకులని తేలింది. ఇద్దరు సాయుధులు ఆదివారం సిడ్నీలోని బాండీ బీచ్‌ను ఆనుకుని ఉన్న చిన్న పార్క్‌లో వేడుకల్లో మునిగిపోయిన యూదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి 15 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని ఆదివారమే నవీద్ అక్రమ్గా గుర్తించగా మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. సాజిద్‌ను పోలీసులు ఆదివారం ఘటనాస్థలిలోనే అంతంచేయగా నవీద్‌కు బుల్లెట్ గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి ప్రశ్నిస్తున్నామని న్యూ సౌత్‌వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ చెప్పారు. సోదాల్లో నవీద్‌కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జెర్సీ ధరించినట్లుగా కార్డ్‌పై ఫొటోలో కన్పిస్తోంది. కార్డ్ ప్రకారం నవీద్ ఆస్ట్రేలియాలోనే 2001 ఆగస్ట్ 12న జన్మించారు. దీంతో నవీద్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. తండ్రి సాజిద్ విద్యార్థి వీసాతో పాకిస్తాన్ నుంచి 1998లో ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లో ఆ వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత దానిని ‘రెసిడెంట్ రిటర్న్’ వీసాగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి టోనీ బుర్కీ సోమవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన వీసా గడువు ముగిసేలోపే ఆస్ట్రేలియాను వీడినా లేదా ఆస్ట్రేలియాకు ఆవల ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిన పక్షంలో అలాంటి వాళ్లకు తిరిగి ఆస్ట్రేలి యాలోకి అడుగుపెట్టాక ‘రెసిడెంట్ రిటర్న్’ వీసా జారీచేస్తారు. ఆ వీసాతో ప్రస్తుతం సాజిద్ ఆస్ట్రేలియాలో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలి యాకు వచ్చిన ఇన్నేళ్లలో సాజిద్ మూడు సార్లు మాత్రమే దేశం దాటాడు. గతంలో నిఘా పరిధిలో ఉన్నా..యువ నవీద్‌పై గతంలో కొన్ని నెలలపాటు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 2019 అక్టోబర్‌లో తొలిసారిగా నవీద్‌పై ఆస్ట్రేలియా నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదంతో సంబంధమున్న ఇద్దరికీ జైలుశిక్ష పడింది. వీళ్లతో నవీద్‌కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఇతను సైతం ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా లేదా అని తెల్సుకునేందుకు 2019 ఏడాదిలో దాదాపు ఆరునెలలపాటు అతని కదలికలపై ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్(ఏఎస్‌ఐవో) అధికారులు నిఘా పెట్టారు. అయితే తనపై నిఘా ఉందని ముందే పసిగట్టిన నవీద్ ఏళ్ల తరబడి ఎలాంటి ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా మంచివాడిలా నటించాడు. దీంతో వేర్పాటువాద లక్షణాలు, ప్రవర్తన ఇతడిలో లేవని భావించి నవీద్‌ను నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకోలేదు. అదను చూసి ఆదివారం ఇలా దుశ్చర్యకు పాల్పడటంతో ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలో లోటుపాట్లపై మరోసారి సమీక్ష అవసరమనే వాదనలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం నవీద్‌ను మేస్త్రీ పని నుంచి ఒక సంస్థ తొలగించింది. ఆ సంస్థ ఇటీవల దివాలా తీయడంతో వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా నవీద్‌ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia. How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025 -
దొంగను పట్టుకుంటే ఘోరం వెలుగులోకి
సాధారణంగా పోలీసులు ఓ దొంగని పట్టుకుని విచారిస్తే ఏమవుతుంది? అప్పటి వరకు అతడు చేసిన చోరీల చిట్టా బయటకు వస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఆ చోరుడితో పాటు అతడికి తెలిసిన దొంగల జాబితాలు బహిర్గతం అవుతాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం పోయిన సొత్తు, సొమ్ముకు సంబంధించి యజమానులు తమ ఫిర్యాదుల్లో చెప్పిన తప్పుడు లెక్కలు తెలుస్తుంటాయి. 2002లో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని షాహినాయత్‌గంజ్ పోలీసులు సాజిద్ అనే ఘరానా దొంగను పట్టుకున్నారు. ఇతడి విచారణలో కుందన్‌బాగ్ ప్రాంతంలో జరిగిన తల్లీ, ఇద్దరు కూతుళ్ల సామూహిక ఆత్మహత్య విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయప్రదకు హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారవేత్తతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగిన తరవాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగా, జయప్రద తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుందన్‌బాగ్‌లోని రెండంతస్తుల సొంత భవనంలో నివసించేది. కొన్నాళ్ల పాటు కుమార్తెలు తమ చదువుల కోసం కాలేజీలకు వెళ్లివెళ్లేవారు. కానీ, హఠాత్తుగా మానేశారు. తల్లితో పాటు ఇంట్లోనే ఉండిపోయారు. బయట నుంచి అందంగా కనిపించే ఆ భవంతి ప్రాంగణం మాత్రం పట్టించుకునే వాడు లేకపోవడంతో పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయింది. పోర్టికోలో మాత్రం ఎప్పుడూ ఓ కారు ఆగి ఉండేది. తాను బయటకు వచ్చి పరిచయస్తులతో సంప్రదింపులు జరిపినా, ఇరుగుపొరుగు వారితో మాట్లాడినా తన గతం ప్రస్తావన వస్తుందనే ఉద్దేశంతో జయప్రద బాహ్యప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. అదే భావనతో తన పిల్లల్నీ ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసింది. ఫలితంగా ఈ కుటుంబానికి చుట్టుపక్కల వారితో పరిచయాలు, స్నేహాలు లేకుండా పోయాయి. ఈ ఇంటికి రాకపోకలు సాగించే వారు కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట గడప దాటని ఈ కుటుంబం అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళ మాత్రం బయటకు వచ్చి క్యాండిల్ వెలుగులో ఇంటి చుట్టూ సంచరిస్తుండేవారు. అలా వాళ్లు ఎందుకు చేస్తున్నారనే దానిపై స్థానికులు కొన్నాళ్లు ఆరా తీసినా విషయం తెలియలేదు. దీంతో కొందరు వీరి విషయం పట్టించుకోవడం మానేశారు. మరికొందరు భయంతో జయప్రద కుటుంబానికి, ఆ ఇంటికి దూరంగా ఉండిపోయారు. మిస్టరీగా మెలిగే ఈ కుంటుంబం అన్ని చెల్లింపులు ముందస్తుగానే చేసేది. కరెంట్ బిల్ ఏకంగా రెండుమూడేళ్లకు అడ్వాన్స్ కట్టేసేది. పాలు పోసే వ్యక్తికి, పేపర్ బాయ్‌కి దాదాపు ఏడాదికి సరిపడ డబ్బు ముందే ఇచ్చేది. ఏడాదికి అవసరమైన సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకునేది. ఎవ్వరి కంటా పడకూడదనే ఉద్దేశంతో ఇంటికి సమీపంలో ఉన్న చెత్తడబ్బా దగ్గరకీ తమ కారులో వెళ్లి చెత్తను పడేసి వచ్చేది. ఎవరికీ పట్టని, ఎవరినీ పట్టించుకోని ఈ కుటుంబంతో సమీపంలో ఉండే ఓ కాలేజీ విద్యార్థులు మాత్రం ఓ సందర్భంలో ఘర్షణపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచానికి దూరంగా జయప్రద కుటుంబం నివసిస్తున్న ఈ ఇంట్లో 2002 జూన్ నెల నుంచి నిశ్శబ్దం నెలకొంది. అయినా ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పట్టించుకుని పోలీసులకు సమాచారం అందించలేదు.షాహినాయత్ గంజ్ పోలీసులు అదే ఏడాది సెప్టెంబర్ 15న ఇళ్లల్లో దొంగతనాలు చేసే ఘరానా దొంగ మహ్మద్ సాజిద్‌ను పట్టుకున్నారు. ఇతడి విచారణలో అనేక నేరాలు వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటే లోకం చూడని సామూహిక ఆత్మహత్యల సమాచారమూ వెల్లడైంది. కుందన్‌బాగ్‌లోని ఓ బంగ్లాలో తాను చోరీకి వెళ్లానని, ఆ ఇంటి ప్రధాన ద్వారం లోపలి నుంచి తాళం వేసి ఉండగా, పక్క ఉన్న మరో తలుపు తీసి ఉండటంతో లోపలకు ప్రవేశించానని చెప్పాడు. ఆ ఇంట్లోని బెడ్రూమ్లో మంచంపై ముగ్గురు మహిళల మృతదేహాలు పడి ఉన్నాయని, దీంతో తొలుత కాస్త భయపడినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పదేపదే ఆ ఇంట్లోకి వెళ్లి వస్తూ అందినకాడికి సొత్తు ఎత్తుకుపోయానని బయటపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న షాహినాయత్‌గంజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుందన్‌బాగ్ ప్రాంతం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆ అధికారులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి చోరుడిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అతగాడు వరుస చోరీలు చేసిన ఇంటిని చూపించమని కోరారు. సాజిద్ నేరుగా తీసుకువెళ్లి జయప్రద ఇంటిని చూపించాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో, బెడ్రూమ్లో మంచంపై ఉన్న మూడు మృతదేహాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వరండాలో గుట్టగా పడి ఉన్న వార్తాపత్రికలను సేకరించి పరిశీలించారు. అవి ఆ ఏడాది జూన్ 21 తేదీ నుంచి ఆ రోజు వరకు (సెప్టెంబర్ 15) సంబంధించినవిగా తేలడంతో 2002 జూన్ 20 రాత్రి ఈ ఆత్మహత్యలు జరిగినట్లు అంచనా వేశారు. ఆ గదిలో దొరికిన గుర్తుతెలియని విషం ఫినాయిల్గా తేలింది. మృతదేహాలకు సమీపంలోనే ఫినాయిల్ బాటిల్ సైతం పోలీసులకు లభించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుందన్‌బాగ్‌తో పాటు హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సామూహిక ఆత్మహత్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. -శ్రీరంగం కామేష్ -
సాజిద్ మాయాజాలం
రావల్పిండి: ఇంగ్లండ్ బ్యాటర్ల బలహీనతపై పాకిస్తాన్ దెబ్బ కొట్టింది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను రూపొందించి మూడో టెస్టులో శుభారంభం చేసింది. గురువారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 68.2 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్లు సాజిద్ అలీ, నోమన్ అలీ తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. రావల్పిండిలోనూ ఈ ఇద్దరు మరోసారి ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టారు. ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 128 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మరో వికెట్ లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్‌కు లభించింది. ఒకదశలో ఇంగ్లండ్ జట్టు 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జేమీ స్మిత్ (119 బంతుల్లో 89; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగ చకచకా పరుగులు చేశాడు.గుస్ అట్కిన్సన్ (39; 5 ఫోర్లు)తో కలిసి జేమీ స్మిత్ ఏడో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (29; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేశారు. క్రాలీని నోమన్ అలీ అవుట్ చేశాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అబ్దుల్లా షఫీఖ్ (14; 1 ఫోర్), సయీమ్ అయూబ్ (19; 1 ఫోర్), కమ్రాన్ గులామ్ (3) అవుటయ్యారు. షాన్ మసూద్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
‘మోదీ పాక్‌తో వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా’
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా శక్తిమంతమైన నాయకుడని ప్రముఖ పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రసంశలు కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ.. భారత్‌ను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మూడోసారి కూడా ప్రధాని అవుతారు. ప్రధాని మోదీ భారత్‌కే కాకుండా ప్రపంచానికి కూడా మంచి చేస్తున్నారు. అందుకే మోదీ వంటి నాయకుడు పాకిస్తాన్‌కు కావాలి. పాక్‌తో మోదీ వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.ప్రశాంతంగా ఉండే పాకిస్తాన్ భారత్‌కు కూడా మంచిదే. ఎక్కడ చూసిన మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వినిపిస్తోంది. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మోదీ ప్రజాదరణ చాలా అద్భుతం. భవిష్యత్తులో భారత్ ప్రజాస్వామ్యం నుంచి చాలా నేర్చుకుంటారు.పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక.. పీఓకేలో విద్యుత్ చార్జీల పెరగుదల కారణంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను పాక్ వెతకటం లేదు. ఎగుమతులను పెంచటం. ఉగ్రవాదాన్ని నియంత్రణ చేయటం. శాంతి భద్రతలను మెరుగుపరటంలో చొరవ చూపటం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి సరైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నా’అని సాజిద్ తరార్ తెలిపారు. -
ఫలక్‌నూమాలో చిన్నారి అదృశ్యం
ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారీ పాప తప్పిపోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.....కర్నాటక బీదర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సాజిద్ ఈ నెల 18వ తేదీనా ఫలక్‌నుమాలోని జహనుమా ల్యాన్సర్ ప్రాంతానికి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా వచ్చాడు. కాగా ఈ నెల 20వ తేదీనా ఉదయం 8 గంటలకు తన చిన్న కుమార్తె నజ్మా(2) బంధువుల చిన్నారులతో కలిసి తిను బండారాల కోసం స్థానికంగా కిరాణ దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మేరకు సాజిద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ చిన్నారీ ఆచూకీ తెలిసిన వారు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616512 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
కట్నం తీసుకురాలేదనే అక్కసుతో..
హైదరాబాద్: కట్నం కోసం కట్టుకున్న భార్యపైనే యాసిడ్ పోశాడో భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రెండేళ్ల క్రితం సాజిద్ అనే వ్యక్తికి ఉజ్మతో వివాహమైంది. అయితే పెళ్లయినప్పటి నుంచే సాజిద్ కట్నం డిమాండ్ చేయటం మొదలుపెట్టాడు. కట్నం ఇవ్వకుంటే పుట్టింటికి వెళ్లిపోవాలని భార్యను తరచూ బెదిరించాడు. దీంతో దిక్కుతోచని ఉజ్మ కన్నవారింటికి వచ్చేసింది. అయితే భార్య కట్నంతో తిరిగి రాలేదనే కోపంతో సాజిద్ తన సోదరులతో కలిసి నిద్రిస్తున్న ఉజ్మపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఉజ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యాసిడ్ దాడితో 30 నుంచి 50 శాతం వరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషయంగా వైద్యులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడ్డ సాజిద్ పరారీ అయ్యాడు. ఉజ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సాజిద్ సోదరులు మజిద్, రిజ్వాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సాజిద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది
* కేక్ కట్ చేయాలని పిలిచి.. భవనంపై నుంచి తోసేసిన ప్రియుడు హైదరాబాద్: ప్రేమోన్మాదుల దాడికి యువతులు బలవుతూనే ఉన్నారు. తనను ప్రేమించడం లేదని సోమవారం ఓ ఉన్మాది రవళిని కత్తితో దాడి చే సిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమె పుట్టినరోజు నాడే హతమార్చేందుకు కుట్ర చేశాడు. కేక్ కట్ చేయాలంటూ భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా తోసేశాడు. అదృష్టవశాత్తు సిమెంట్ రేకులపై పడడంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకలగూడ చింతబావికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గడ్డం శ్రీశైలం పెద్దకుమార్తె రూప (21). పదవ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. జీడిమెట్ల గాజులరామారానికి చెందిన మహ్మద్ సాజిద్ (24)తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. సాజిద్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం వచ్చి... మంగళవారం రూప పుట్టిన రోజు కావడంతో అదేరోజు ఆమెను హతమార్చేందుకు సాజిద్ పథకం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగా సాయంత్రం రూప ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలని ఆమెను అపార్ట్మెంట్(మూడంతస్తుల భవనం)పైకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తనను నిర్లక్ష్యం చేస్తున్నావని ఆగ్రహించిన సాజిద్.. రూప ను బలవంతంగా అక్కడి నుంచి నెట్టివేశాడు. రేకుల షెడ్‌పై పడడంతో రూప తల, మెడకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, సాజిద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రస్తుతం రూపకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న తనను నిర్లక్ష్యం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉండడం భరించలేకే రూపను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు సాజిద్ పోలీసులకు తెలిపాడు. కాగా, సోమవారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బీటెక్ విద్యార్థిని రవళి కూడా సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. -
స్కూల్ కు వెళ్లలేదని కొడుకుని చంపిన తండ్రి!
స్కూల్ కు వెళ్లడం లేదని ఆగ్రహించిన తండ్రి తన పదేళ్ల కుమారుడిని చంపేసిన సంఘటన థానేలో సంచలనం రేపింది. థానే జిల్లాలోని అంబర్ నాథ్ పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా స్కూల్ కు ఎందుకు వెళ్లడం లేదని, ఎందుకు చదవడం లేదని పదేళ్ల సాజిద్ ను తండ్రి అజిత్ మజిద్ ఖాన్ ప్రశ్నించినట్టు సమాచారం. అయితే కుమారుడు నుంచి ఎంతకు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన మజిద్ ఖాన్ కర్రతో సాజిద్ తలపై పలుమార్లు కొట్టినట్టు పోలీసులు తెలిపారు. తలకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత పరిస్థితి విషమించడంతో థానే సివిల్ ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా తుది శ్వాస విడిచారని శివాజీ నగర్ ఇన్స్ పెక్టర్ డీఎస్ గెవాడే తెలిపారు. నిందితుడు మజిద్ ఖాన్ ఐదుగురు భార్యలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడు సాజిద్ తల్లి ఐదేళ్ల క్రితమే భర్తకు దూరంగా ఉంటున్నట్టు స్థానికులు వెల్లడించారు. కాని సాజిద్ తన తండ్రితోనే ఉంటున్నట్టు తెలిసింది. సాజిద్ మృతికి కారణమైన మజిద్ ఖాన్ పై సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు.


