ఫలక్‌నూమాలో చిన్నారి అదృశ్యం | The disappearance of the child | Sakshi
Sakshi News home page

ఫలక్‌నూమాలో చిన్నారి అదృశ్యం

Jul 21 2016 6:09 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారీ పాప తప్పిపోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారీ పాప తప్పిపోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.....కర్నాటక బీదర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సాజిద్ ఈ నెల 18వ తేదీనా ఫలక్‌నుమాలోని జహనుమా ల్యాన్సర్ ప్రాంతానికి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా వచ్చాడు.

 

కాగా ఈ నెల 20వ తేదీనా ఉదయం 8 గంటలకు తన చిన్న కుమార్తె నజ్మా(2) బంధువుల చిన్నారులతో కలిసి తిను బండారాల కోసం స్థానికంగా కిరాణ దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మేరకు సాజిద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ చిన్నారీ ఆచూకీ తెలిసిన వారు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616512 నంబర్‌లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement