Chattisghad State
-
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్ల మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవగాయాలయ్యాయి. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు తొలగిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్ పేరుతో వారి ఏరివేత చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయులో లొంగుబాటులు జరిగియి. కొంతమంది అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ నేపథ్యంలో వారు అమర్చిన ముందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
అద్భుతం.. శిశువు కోసం ఎయిర్‌లిఫ్ట్ చేసి ప్రాణాలు పోసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కిమ్స్ వైద్యులు అద్భుతం సృష్టించారు. తీవ్రమైన శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతున్న 9 నెలల శిశువుకి ఎయిర్ లిఫ్ట్ చేసి ప్రాణాలు పోశారు. 45 రోజులు తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆ పసికందును ప్రాణాపాయం లేకుండా రక్షించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ & పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్, డా. పరాగ్ డెకాటే వివరించారు. వివరాల్లోకి వెళితే..ఛత్తీస్‌గఢ్, రాయపూర్‌కు చెందిన తొమ్మిది నెలల శిశువు మెుదటగా జలుబు, దగ్గుతో ఆస్పత్రిలో చేరింది. అనంతరం కొద్ది రోజులకో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన అడెనో వైరస్ కారణంగా వచ్చే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (అడెనోవైరల్ న్యూమోనియా), శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది.శిశువు పరిస్థితి అత్యవసరంగా మారడంతో కిమ్స్ కడల్స్ నియోనేటల్, పీడియాట్రిక్ ట్రాన్స్పోర్ట్ బృందం హుటాహుటీన రాయపూర్‌కు చేరుకుంది. అక్కడ శిశువును చికిత్సను అందించి వెంటిలేటర్‌పై ఉంచి విమానశాఖ సమన్వయంతో సురక్షితంగా హైదరాబాద్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు.కిమ్స్ కడల్స్ కొండాపూర్ లో పీడియాట్రిక్ ఐసీయూ చేర్చిన అనంతరం శిశువుకు తీవ్రమైన ఎఆర్డీఎస్ తో పాటు న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల చుట్టూ గాలి చేరడం) ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఎఫ్ఓవీ, (ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ వంటి చికిత్సలు చేసినప్పటికీ శ్వాసలో మెరుగుదల కనిపించలేదు. దీంతో పరిస్థితి విషమంగా మారడంతో కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్స మరియు పీడియాట్రిక్ ఐసీయూ బృందాలు కలిసి విఏ ఎక్మో చికిత్స ప్రారంభించాం. ఈ యంత్రం గుండె, ఊపిరితిత్తుల పనిని తాత్కాలికంగా నిర్వహిస్తూ శరీరానికి ఆక్సిజన్ అందించడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ను తొలగిస్తుంది.శిశువు 25 రోజులపాటు ఎక్మోపై ఉండగా, వైద్య బృందం అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది. అధిక వైరల్ లోడ్, ఇతర ఇన్ఫెక్షన్లు, గాలి లీకులు, రక్తస్రావం, రక్తపోటు మార్పులు వంటి సమస్యలను విజయవంతంగా చికిత్సను అందించాం.తదుపరి శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో ఎక్మో మరియు వెంటిలేటర్ నుంచి విజయవంతంగా తొలగించాం. మొత్తం 45 రోజుల చికిత్స అనంతరం శిశువును పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ చేశారు.ఈ విజయవంతమైన చికిత్సలో పీడియాట్రిక్ ఐసీయూ వైద్యులు డా. కళ్యాణ్ కె, డా. అవినాష్ రెడ్డి పి, డా. వినోద్ కుమార్, డా. మాధురి కె కార్డియోథొరాసిక్ సర్జన్ డా. సందీప్; ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డా. రవి తేజ పాల్గొన్నారు. “సమయానికి సరైన చికిత్స అందడం ఎంత ముఖ్యమో ఈ కేసు నిరూపించింది. ఎక్మో వంటి ఆధునిక ‘రెస్క్యూ థెరపీలు’ అందుబాటులో ఉండటం ప్రాణాలను కాపాడటంలో కీలకం. వెంటిలేటర్‌పై ఉన్న శిశువును ఎయిర్‌లిఫ్ట్ చేసి, దీర్ఘకాలం ఈసీఎంఓపై నిర్వహించడం అనేది నైపుణ్యం కలిగిన వైద్య బృందం వల్లే సాధ్యమైంది” అని డా.పరాగ్ ఈ సందర్భంగా వివరించారు. -
అద్భుతం.. 320 కోట్ల ఏళ్ల నాటి చరిత్ర సాక్ష్యాలు
సాక్షి : నేడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, ఖనిజ సంపదతో అలరారుతున్న . ఒకప్పుడు నిశ్శబ్దంగా అలలు ఎగసిపడే మహా సముద్రం అంటే నమ్మగలమా? కానీ, భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలు ఇదే నిజాన్ని రూఢీ చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ, సింగ్భూమ్ ప్రాంతాలు 320 కోట్ల ఏళ్ల క్రితం విశాలమైన జలరాశిలో ఉండేవని, ఆధునిక ప్రపంచానికి ఇది అత్యంత పురాతనమైన 'సాగర రహస్యం' అని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. భూమి పరిణామ క్రమంలో ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి నేతృత్వంలోని బృందం చేసిన అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది. సుమారు 3.2 బిలియన్ అంటే 320 కోట్ల ఏళ్ల క్రితమే సింగ్భూమ్ ప్రాంతం సముద్రం నుంచి పైకి ఉద్భవించింది. అంటే, భూమిపై ఏర్పడిన అత్యంత పురాతన ఖండాంతర భూభాగాలలో ఇది మొదటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ లభించిన 'జిర్కాన్' స్పటిక రేణువుల విశ్లేషణ ద్వారా ఆ కాలంలోనే నదులు, తీర ప్రాంతాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి.మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులు..రాంచీ దాని పరిసర ప్రాంతాల్లోని శిలలు మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తున్నాయి. భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నితీష్ ప్రియదర్శి ప్రకారం, ఇక్కడ కనిపించే ఇసుకరాయి, సున్నపురాయి, పగడపు శిలాజాలు ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదని స్పష్టం చేస్తున్నాయి.కాంగ్లోమరేట్లు.. నీటి ప్రవాహం వల్ల గుండ్రంగా మారిన రాళ్లతో కూడిన ఈ అవక్షేప శిలలు సముద్ర నిక్షేపణకు ప్రధాన సాక్ష్యం. పట్రాటు సమీపంలోని బెంటి బాగ్దా ప్రాంతంలో లభించే సున్నపురాయి సాధారణంగా నిస్సారమైన సముద్ర వాతావరణంలోనే ఏర్పడుతుంది. పట్రాటు నుండి బర్కగావ్ వెళ్లే దారిలోని రాళ్ల ఆకృతులు, ఒకప్పుడు అలల తాకిడికి గురై రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తాయి.కోట్లాది ఏళ్ల క్రితం భూమి లోపల జరిగిన టెక్టోనిక్ కదలికల కారణంగా ఒకప్పుడు నీటి అడుగున ఉన్న ఈ భూభాగం నెమ్మదిగా పైకి లేచింది. భారతదేశం 'గోండ్వానా ల్యాండ్'లో భాగంగా ఉన్న కాలంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దామోదర్ లోయ ప్రాంతం ఒకప్పుడు చిత్తడి నేలలు లేదా నిస్సార సముద్రంగా ఉండేదని, అందుకే అక్కడ నేడు భారీ స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఏర్పడ్డాయని నిపుణులు వివరిస్తున్నారు.సముద్రానికి, మానవ పరిణామానికి ఉన్న ఈ విడదీయలేని బంధాన్ని గుర్తుచేస్తూనే.. భారతదేశం ప్రతి ఏటా ఏప్రిల్ 5న 'జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని' జరుపుకుంటుంది. ప్రాచీన కాలం నుంచి సముద్ర వాణిజ్యంలో భారత్ అగ్రగామిగా ఉండటమే కాకుండా, మన నేల గర్భంలో దాగి ఉన్న ఇటువంటి భౌగోళిక రహస్యాలు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. నేడు మనం రాంచీ కొండలపై నిలబడి చూస్తున్న దృశ్యం వెనుక, కోట్లాది ఏళ్ల క్రితం సముద్రపు అలల సంగీతం దాగి ఉందన్నది కాదనలేని వాస్తవం.పసుపులేటి. వెంకటేశ్వరరావు -
లొంగిపోయిన నక్సల్స్‌తో.. పోలీసులకు శిక్షణ
ఇటీవల కాలంలో కేంద్రం బలగాలు మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన నక్సల్స్‌ను పోలీసులు కీలక ఆపరేషన్ కోసం వాడుకుంటున్నారు. కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్ ఫేర్ కోసం మావోయిస్టులతో పోలీసులు శిక్షణ తీసుకోనున్నారు.ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులలో ఐఈడీలు, గెరిల్లా వ్యూహాలలో సిద్ధహస్తులైన డజనుకు పైగా మావోయిస్టులను కాంకేర్‌లోని సీటీజేడబ్ల్యూ కళాశాలకు పంపించారు. అక్కడ వారు పోలీసు అధికారులకు IED నిర్వహణ, గెరిల్లా యుద్ధ వ్యూహంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దానితో పాటు కొత్తగా నియమితమైన డీఎస్పీలకు, ఎస్సైలకు గెరిల్లా యుద్ధానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందిస్తారని బస్తర్ ఐజీ తెలిపారు.మావోయిస్టుల కార్యక్రమాలపై పోలీసులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇదివరకే అడవిలో రహదారులపై అమర్చిన ఐఈడీలను గుర్తించడంలో నక్సలైట్లు ఎంతగానో సహాయపడ్డారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు సాధారణంగా ఐఈడీలను అమర్చే క్రమంలో ఆకులను ఇతరాత్రా సహజ సంకేతాలను ఉపయోగిస్తారని వాటిని గుర్తించడంలో లొంగిపోయిన మావోయిస్టులు ఎంతగానో ఉపయోగపడుతారని తెలిపారు.అయితే ఇటీవల లొంగిపోయిన 600 మంది మావోయిస్టులను బస్తర్‌లోని ఆరు పునారావాస కేంద్రాల్లో ఉంచుతున్నామని జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వారికి యోగా, కౌన్సిలింగ్, స్కిల్ డెవలఫ్‌మెంట్, ఉపాధి శిక్షణ తదితరాలు అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా సైకాలజిస్టుల పర్యవేక్షణలో వారి ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. -
బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) కలకలం సృష్టిస్తోంది. స్థానిక ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.బిలాస్‌పూర్‌లోని కోని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో మార్చి 19 నుండి 24 మధ్య సుమారు 4,400 కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 5,037 కోళ్లు ఉన్న ఈ కేంద్రంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్, పూణేలోని ప్రయోగశాలలకు పంపగా, భోపాల్ ల్యాబ్ నివేదికలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఉన్నట్లు ధృవీకరించారు.రెడ్ జోన్‌గా ఒక కిలోమీటర్ పరిధివైరస్ నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తక్షణమే నివారణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ఫారం చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిని 'ఇన్ఫెక్టెడ్ జోన్' (వ్యాధి ప్రభావిత ప్రాంతం)గా, పది కిలోమీటర్ల పరిధిని 'సర్వైలెన్స్ జోన్' (పర్యవేక్షణ ప్రాంతం)గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం, ఇన్ఫెక్టెడ్ జోన్‌లోని కోళ్లు, గుడ్లు, మేతను పూర్తిగా నాశనం చేయనున్నారు. ఈ ప్రాంతంలో పక్షుల రవాణాను పూర్తిగా నిషేధించారు. నష్టపోయిన పౌల్ట్రీ యజమానులకు పశుసంవర్థక శాఖ ద్వారా పరిహారం అందజేస్తామని వెల్లడించారు.మనుషులకు ముప్పు పొంచి ఉందా?పరిస్థితిని పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించారు. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు నిర్వహించి, యాంటీ వైరల్ మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటివరకు మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారులకు సహకరించాలని జిల్లా మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: కమల్ మరో సంచలనం.. స్టాలిన్‌కు మద్దతుగా.. -
పెళ్లి చేసుకోమని వేధిస్తోంది
ఛత్తీస్‌గఢ్‌లో ఒక మహిళా డీఎస్పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్ థండన్ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.ఛత్తీస్‌గఢ్ రాయిపూర్‌కు చెందిన దీపక్ థండన్ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్‌పూర్‌లో ఉన్న ఒక హోటల్ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్ అన్నారు.ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది. -
అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!
ఇంతవరకు ఎంతోమంది ఐఏఎస్ అధికారులను చూసి ఉండుంటారు. అతెందుకు టీనా దాబి, అమిత్ లోధా వంటి ఎందరో సెలబ్రిటీ హోదాని పొందిన అధికారులను చూశాం. కానీ ఈ ఐఏఎస్ అధికారి గురించి విని ఉండటం అత్యంత అరుదు. ఒక్క రూపాయే జీతం తీసుకున్న ఐఏఎస్ అతడు. కానీ కలెక్టర్లందరి కంటే అత్యంత ధనిక కలెక్టర్ ఆయన. ఎవరా కలెక్టర్ అంటే..అతడే ఐఏఎస్ అమిత్ కటారియా. ఆయన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి కుటుంబం కోట్లలో వార్షిక టర్నోవర్‌తో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రన్ చేస్తోంది . అంతేగాదు ఆ వ్యాపార సామ్రాజ్యం ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా విస్తరించి ఉంది. అయితే కటారియా కుటుంబ వ్యాపారాన్ని పక్కకుపెట్టి మరీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అలా కటారియా ఐఏఎస్ అయిన ధనవంతుడుగా నిలిచాడు.. ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్.. అమిత్ కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, కటారియా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE)కి ప్రిపేరవ్వడం ప్రారంభించారు. చివరికి 2003లో సివిల్స్ నియామక పరీక్షలో ఉత్తీర్ణుడై ఐఏఎస్ అయ్యారు. ఆయన ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. చత్తీస్గడ్ కేడర్‌లో కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే ఐఏఎస్ అమిత్ కటారియా సివిల్ సర్వీసెస్‌లో చేరినప్పుడు కేవలం రూ. 1 జీతమే తీసుకునేవారని సమాచారం. అందుకు కటారియా తాను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఐఏఎస్ అయ్యానని అంటుండేవారని అంతరంగికులు చెబుతున్నారు. అమిత్ కటారియా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇది ప్రోటోకాల్‌కు విరుద్ధం. ఆ సమయంలో కటారియా ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. వైవాహిక జీవితం..ఐఏఎస్ అమిత్ కటారియా వృత్తిరీత్యా వాణిజ్య పైలట్ అయిన అస్మితా హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరుచుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. పైగా ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఆ జర్నీల తాలుకా ఫోటోలను షేర చేసుకునేవారు. ఇక ఈ ఐఏఎస్ అమిత్ కటారియా ఆస్తులు నికర విలువ దాదాపు రూ. 8.90 కోట్లు పైనే అని అంచనా. (చదవండి: సైన్స్ కోర్సు చదవలేకపోయా..! క్షణాల్లో వీడియో వైరల్.. ఏకంగా కేంద్ర విద్యామంత్రే..) -
మహదేవ్ బెట్టింగ్ స్కామ్: కీలక నిందితుడి అరెస్టు!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో ప్రధాని నిందితుడు రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో ఇంటర్‌పోల్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రవిని భారత్ తీసుకువచ్చేందుకు ఈడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రాయ్‌పూర్ పీఎంఎల్ఏ కోర్టులో ఇప్పటికే ఈడీ రవి ఉప్పల్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రవి తన భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకోకుండానే వనాతు ఐలాండ్ పాస్పోర్టుతో దుబాయ్‌లో ఉంటున్నట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో రూ.6 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఈడీ పేర్కొంది. ఆశిమ్ దాస అనే కొరియర్ ద్వారా రూ.508 కోట్ల ముడుపులను మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాగేల్కు చెల్లించారని అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయగా దీనికి పూర్తి విరుద్ధంగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇదీచదవండి..డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్ -
అంగట్లో ఆడపిల్ల: ఏడు నెలల్లో ఏడు సార్లు
భోపాల్: మార్కెట్లో ఓ సరుకు మాదిరి అమ్మాయిల జీవితం అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ అమ్మాయిని ఏడు నెలల కాలంలో ఏడుసార్లు అమ్మకానికి పెట్టారు. ఆ ఏడుసార్లు ఒక్కొక్కరు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. చివరకు ఒకతను మానసిక దివ్యాంగుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అవమానంగా భావించిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీనికి కారకులైన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్కు చెందిన ఓ 18 ఏళ్ల యువతి తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేది. అయితే ఆమె వ్యవసాయ పనులు చేయడం ఇష్టం లేని ఓ బంధువు ఆమెకు మంచి ఉపాధి చూపిస్తానని చెప్పాడు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆమెను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ఆ యువతి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్వులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టి ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకెళ్లిన దంపతులే బెదిరింపులకు పాల్పడిన వారు కావడం గమనార్హం. ఆ దంపతులు ఏడు నెలల కిందట రూ. 20 వేలకు ఛత్తార్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆ అమ్మాయిని విక్రయించారు. అక్కడి నుంచి వేరొకరు.. అటు నుంచి ఇతరులు. ఇలా ఏడు నెలల కాలంలో ఆమెను ఏడు మందికి విక్రయించారు. చివరకు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన సంతోశ్ కుష్వాహాకు రూ. 70 వేలకు ఆ బాలికను విక్రయించారు. సంతోశ్ తన కుమారుడు బాబ్లూ కుష్వాహా (మానసిక దివ్యాంగుడు)కు ఆ యువతినిచ్చి బలవంతంగా పెళ్లి చేశాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురయి గతేడాది సెప్టెంబర్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 8మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి విషాద జీవితం గురించి తెలిపారు. -
చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్కౌంటర్
చత్తీస్‌గఢ్: పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన కాంకర్ జిల్లా తడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పి. సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా రిజర్వ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత అవతలి వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం మొదట కాల్పులు ప్రారంభమైన చోటుకి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వాటితో పాటు రెండు ఎస్ఎల్ఆర్ తుపాకులు, ఒక .303 రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీఐజీ వివరించారు. -
బంగారంలాంటి మనసు!
ఆమె సుపరిచిత ఉద్యమకారిణి కాదు.ఉపన్యాసకురాలు అంతకంటే కాదు.ఒకమంచి పనిచేయడానికి ఉద్యమించే స్వభావం, ఉర్రూతలూగించే ఉపన్యాస చాతుర్యం అవసరమే కావచ్చుగానీ అవి లేకపోయిన ‘చిత్తశుద్ధి’, ‘నిబద్ధత’ ఉంటే చాలు నిశ్శబ్దంగా కూడా సమాజానికి పనికొచ్చే మంచి పని చేయవచ్చని నిరూపించారు కాజల్ రాయ్.ఛత్తిస్ఘడ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాలోని సన్నా గ్రామానికి చెందిన కాజల్ వార్డ్ మెంబర్. ఊళ్లో సగానికి మందికి పైగా ‘బహిరంగ మలవిసర్జన’ అలవాటు ఉంది. ఈ అలవాటును మాన్పించడానికి ఒక తనవంతుగా ఏంచేయాలి? అని ఆలోచించి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించింది.ఆమె ప్రచారం కొద్దిమందికి నచ్చింది. కొద్దిమందికి చాదస్తంగా అనిపించింది.నచ్చిన వాళ్లు అప్పో సప్పో చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నచ్చని వాళ్లు మాత్రం వెటకారం చేయడం, సాకులు వెదకడం ప్రారంభించారు. ‘సర్కార్కేం? ఎన్నయినా చెబుతుంది. మా దగ్గర డబ్బు ఉండద్దూ’ అని కొందరంటే...‘మా తాతముత్తాతలు పొద్దున లేచి వనాలకే పోయారు. మేమూ అదే చేస్తున్నాం. కొత్తగా ఇదేమిటి?’ అని కొందరు దీర్ఘాలు తీశారు.అందరికీ ఓపికగా సమాధానం చెప్పింది కాజల్. ‘బహిరంగ మలవిసర్జన’ అలవాటు పూర్తిగా తొలగిపోవాలనే మన లక్ష్యం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరు పూనుకోవాలి అని చెప్పింది. ‘మరుగుదొడ్డి అంటే నాలుగు గోడల నిర్మాణం కాదు... మన ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతీక’ అని ఆమె చెప్పిన మాట చాలామందిని సూటిగా తాకింది.‘‘నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇంటి దగ్గర మరుగుదొడ్డి కట్టుకోవాలని నాకు కూడా ఉంది. కాని మా పరిస్థితి నీకు తెలుసు కదా తల్లీ’’ అన్నారు కొందరు.అప్పుడు ఆలోచనలో పడిపోయింది కాజల్.ప్రార్థించే పెదవులతో పాటు సహాయం చేసే చేతులు కూడా కావాలి. అప్పుడు ఆమెలో ఒక కొత్త ఆలోచన చోటు చేసుకుంది. ‘బహిరంగ మలవిసర్జన మానండి. మరుగుదొడ్లు కట్టుకోండి’ అని పదేపదే పోరే బదులు ‘నా దగ్గర ఇంత డబ్బుంది. మీకు సహాయపడగలను’ అని చెబితే బాగుంటుంది కదా అనుకుంది. కాని తన దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడివి?వెంటనే తన దగ్గర ఉన్న నగలు గుర్తుకువచ్చాయి. వాటిని తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన సొమ్ముతో గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి అవసరమైన సహాయం చేయడానికి రంగంలోకి దిగింది. ముందు తన వార్డ్ నుంచి పని మొదలుపెట్టింది. ఇప్పటి వరకు వందకుపైగా టాయిలెట్ల నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని అందించింది కాజల్ రాయ్. కాజల్ గురించి విన్న జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ‘నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’లో భాగంగా ఇటుకల తయారీలో శిక్షణలను ఇప్పించారు. తాను నేర్చుకున్న విద్యను ఇతర మహిళలకు కూడా నేర్పించి టాయిలెట్లు నిర్మించుకోవాలనుకునేవారికి అవసరమైన ప్రాథమిక వస్తువులను తయారుచేసుకోవడానికి వీలు కల్పించింది కాజల్.ఇటుకల తయారీ మాత్రమే కాదు... సొంతంగా టాయిలెట్లు నిర్మించుకోవాలనుకునేవారికి, స్టెప్ బై స్టెప్ ఎలా నిర్మించుకోవాలో నేర్పించింది కాజల్. ‘‘నగలు తాకట్టు పెట్టి నువ్వు చాలా పిచ్చి పని చేశావు’’ అంటూ బాధ పడ్డారు చుట్టాలు పక్కాలు.‘‘గవర్నమెంట్ నీకు మంత్రి పదవి ఏమైనా ఇస్తుందా ఏమిటి?’’ అని ఆటపట్టించే ప్రయత్నం చేశారు కొందరు.నగలు తాకట్టు పెట్టినందుకు బాధపడలేదు.సూటిపోటి మాటలకు వెనకడుగు వేయనూ లేదు.‘‘నేను చేసిన పని వల్ల మంచి జరిగితే చాలు’’ అనుకుంది కాజల్.ఒక వార్డ్ మెంబర్‌గా కాజల్ రాయ్ పేరు సన్నా గ్రామానికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం జష్పూర్ జిల్లాతో పాటు ఛత్తిస్ఘడ్ రాష్ట్రం మొత్తానికి ఆమె పేరు సుపరిచితం అయింది.‘‘నా మెడలో ఉన్న హారం కంటే... నా గ్రామంలో ఉన్న మరుగుదొడ్డిని చూసి గర్వపడతాను’’ అంటున్న కాజల్ రాయ్ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.


