రాయ్‌పూర్ : ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవగాయాలయ్యాయి. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు తొలగిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్ పేరుతో వారి ఏరివేత చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయులో లొంగుబాటులు జరిగియి. కొంతమంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ నేపథ్యంలో వారు అమర్చిన ముందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


