
టీమిండియా వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ మెల్‌బోర్న్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది

భర్త, కుమారుడితో కలిసి ఈ సిటీలో చక్కర్లు కొట్టడం తనకు ఎన్నెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చిందని పేర్కొంది

కేఫ్‌లు, రెస్టారెంట్లు, మ్యూజియం, గ్యాలరీలు.. ఇలా తాము చాలా ప్రదేశాలు చుట్టివచ్చామని సంజన తెలిపింది

కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే

ఈ క్రమంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో తొలి టెస్టుకు, ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు

తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆసీస్ గడ్డపై అత్యధిక పరుగుల తేడాతో టెస్టు విజయం సాధించిన తొలి కెప్టెన్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు.

అలా అతడికి ఇదెంతో స్పెషల్ ట్రిప్‌గా మారింది

ఇక ఈ సిరీస్‌లో 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును బుమ్రా అందుకున్నాడు













