
నేడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు, ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. ఉల్లాసంగా యోగాసనాలు వేశారు.

విశాఖలో యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది ఔత్సాహికులు తరలివచ్చారు.

తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం యోగా డే వేడుకలు నిర్వహించింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు.






















