ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
అరవింద్ కేజ్రీవాల్, సునీతా దంపతుల కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది.
ఐఐటీలో క్లాస్‌మేట్, ప్రియుడు సంభవ్ జైన్‌ను వివాహమాడింది హర్షిత.
బంధుమిత్రుల సమక్షంలో నిన్న (ఏప్రిల్ 18) ఢిల్లీలోని కపుర్తల హౌస్‌లో వైభవంగా ఈ మూడుముళ్ల వేడుక జరిగింది.
ఈ గ్రాండ్ వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.


