
డ్రెస్ డిజైన్స్‌లో ఫ్లోరల్ ప్రింట్స్ ప్రాముఖ్యత మనకు తెలిసిందే

ఫ్యాషన్ జువెలరీలోనూ పువ్వుల సిరులు బోలెడంత హంగామాను సృష్టిస్తున్నాయి

పెళ్లికూతురు అలంకరణలో మాత్రమే విరివిగా కనిపించే ఈ పువ్వుల నగలు ఇప్పుడు యువత మదిని అన్ని వేళలా ఆకట్టుకుంటున్నాయి.

ఇయర్ హ్యాంగింగ్స్ గానూ, నెక్‌పీస్‌గానూ ఫ్యాబ్రిక్ పువ్వులు ప్రత్యేకతను చాటుతున్నాయి.

ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో తయారైన పువ్వుల ఆభరణాలు మిగతా వాటిన్నింటితో పోల్చితే ముందువరసలో ఉన్నాయి.

లైట్ వెయిట్ ప్లెయిన్‌గా ఉండే లేత రంగులు ఆర్గంజా ఫ్యాబ్రిక్‌లో కనిపిస్తాయి.

అలాగే, లేస్, లైట్ వెయిట్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ను కూడా ఈ పూల తయారీకి ఉపయోగిస్తారు.

ఇయర్ హుక్స్ మార్కెట్‌లో తీసుకుంటే, ఈ పూల నగలను ఇంట్లోనూ చేసుకోవచ్చు.

కోనుగోలు చేయాలన్నా తక్కువ ధరకే లభిస్తాయి.

డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ ఫ్లోరల్ డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవడమూ సులువే.








