హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2024 నివేదిక విడుదలైంది. 17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించింది.
104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా హైదరాబాద్ ముంబయి, ఢిల్లీ తర్వాత దేశంలో మూడో స్థానంలో నిలిచింది.
తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు.
396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో ఉంది.
217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది.
లిస్ట్‌లో అత్యంత సంపన్న తెలుగువారు: మురళి దివి (దివీస్)
జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్)
హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్‌స్ట్రక్షన్స్)
పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్)
బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్)
ప్రతాప్ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్‌కేర్)
పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా)


