ఈపీఎఫ్‌ఓ 2014లో రూ.1,000గా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్‌ని పెంచలేదు.
పదేళ్ల క్రితం నిర్ణయించిన ఈ పెన్షన్ ఇప్పుడు ఏమాత్రం సరిపోదనే వాదనలున్నాయి.
ఈ మొత్తాన్ని పెంచాలనే డిమాండ్ ఇటీవల అధికమవుతుంది.
దీనికోసం పార్లమెంటరీ కమిటీ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది.
ముప్పై ఏళ్లలో ఇలాంటి రివ్యూ జరగడం ఇదే మొదటిసారి.
2020లో కనీస పెన్షన్‌ను రూ.2,000కి పెంచాలని కార్మిక శాఖ కమిటీకి తెలిపింది. కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది.
2024-25 బడ్జెట్‌కు ముందు ఇది మళ్లీ చర్చకు వచ్చింది.
పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగుల సంఘాలు రూ.7,500 పెన్షన్‌ను డిమాండ్ చేస్తున్నాయి.
రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది.
2025 చివరి నాటికి తుది నివేదిక వెలువడనుంది.
1995లో ప్రారంభించిన ఈపీఎస్-95 అనేది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం.
ఇది కనీసం 10 సంవత్సరాలు పెన్షన్ ప్లాన్‌కి కాంట్రిబ్యూట్ చేసే వారికి ప్రయోజనాలు అందిస్తుంది.


