
14 గ్రామాల ఆరాధ్యదైవం పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది

పెదవాల్తేరు, చినవాల్తేరు, పెదజాలరిపేట, మద్దిలపాలెం, శివాజీపాలెం, నక్కవానిపాలెం, రేసపువానిపాలెం, పీతలవానిపాలెం, మువ్వలవానిపాలెం, మూలపాలెం, వాసవాని పాలెం, జాలరి ఎండాడ, జోడుగుళ్లపాలెం, పెదగదిలి, చినగదిలి తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి.. అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆయా ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాన కూడళ్లు, రహదారులు విద్యుత్ దీపాలతో ధగధగలాడాయి

స్థానిక ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి















