ఐస్‌ ఆమ్లెట్ | Ice omelette in America | Sakshi
Sakshi News home page

ఐస్‌ ఆమ్లెట్

Feb 5 2019 4:38 PM | Updated on Apr 4 2019 3:25 PM

Ice omelette in America - Sakshi

ఐస్‌ ఆమ్లెట్‌... ఎప్పుడైనా తిన్నారా? కనీసం పేరైనా విన్నారా? బహుశా వినకపోవచ్చు. ఎందుకంటే.. గతంలో ఎవరూ ఇలాంటి ఆమ్లెట్‌ వేయలేదు. కానీ అమెరికాలో కురుస్తున్న హిమపాతానికి అక్కడి నదులు, సరస్సులు గడ్డకట్టిపోవడం, రహదారులు, ఇళ్లు మంచుమయం కావడంతో యువత కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. వేడివేడి పెనంపై ఆమ్లెట్‌ వేస్తే మజా ఏముంది? గడ్డకట్టిన మంచుపై వేసి చూద్దామనుకున్నారు. తీరా వేస్తే.. వెడల్పు చేసే అవకాశం ఇవ్వకుండా వెంటనే గడ్డకట్టి పోతోందట. ఇలా మంచుతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ సోషల్‌ మీడియాలో చేస్తున్న పోస్టులు భలే ఫన్నీగా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి.. ఏ ఆధారం లేకుండానే ఈ ప్యాంట్లు ఎలా నిలుచున్నాయో.. అంతా మంచు మహత్యం!


Advertisement
 
Advertisement
Advertisement