వలసదారులంటే నాకు ఇష్టం.. హెచ్‌–1బీ వీసాదారులను అవమానించలేదు: వాన్స్‌ | D Vance walks back H-1B indentured servants remark after Indias protest | Sakshi
Sakshi News home page

వలసదారులంటే నాకు ఇష్టం.. హెచ్‌–1బీ వీసాదారులను అవమానించలేదు: వాన్స్‌

Oct 19 2026 5:15 AM | Updated on Oct 19 2026 5:15 AM

D Vance walks back H-1B indentured servants remark after Indias protest

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాలు కలిగిన విదేశీ నిపుణులను ‘ఒప్పంద సేవకులు’అని తాను సంబోధించడంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పందించారు. తాను అమెరికా కంపెనీలను, వీసా వ్యవస్థను మాత్రమే ఉద్దేశించి మాట్లాడనని, హెచ్‌–1బీ వీసాదారులను కాదు అని స్పష్టం చేశారు. 

అప్పట్లో జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వాన్స్‌ భాష వలసవాద వారసత్వ భావజాలంతో ఉందని పేర్కొంది. ఆయన శనివారం సీబీఎస్‌ న్యూస్‌ కార్యక్రమంలో ‘ఒప్పంద సేవకులు’ అంశంపై స్పందించారు. తాను విమర్శించింది వీసా వ్యవస్థను మాత్రమేనని పేర్కొన్నారు.

ఈ వ్యవస్థ విదేశీ ఉద్యోగులపై కంపెనీల యజమానులకు మితిమీరిన అధికారాన్ని కలి్పస్తుందని, ఆ ఉద్యోగులను తిరిగి వారి స్వదేశాలకు పంపే అవకాశం ఉండటంతో వారిని ఒక రకంగా ఒప్పంద సేవకుల లాగా చూసే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. 

తాను ఉపయోగించిన భాషలో ఏదైనా లోపం ఉంటే దానికి పూర్తి బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారు. హెచ్‌–1బీ వీసా కలిగిన వ్యక్తులను విమర్శించే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని అన్నారు. తన అత్తమామలు దక్షిణ భారతదేశానికి చెందినవారేనని ప్రస్తావించారు. 

‘‘దక్షిణ భారతదేశం నుండి వలస వచి్చన నా అత్తామామలను నేను ఎంతో అభిమానిస్తాను. వారి కుమార్తె.. అంటే నా భార్య అమెరికాలో జని్మంచారు. ఆమె పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ఆమెను నేను ఎంతో ప్రేమిస్తాను. వలసదారులను అమానవీయంగా చూడటం నా ఉద్దేశం కాదు. నిజానికి నాకు చాలామంది వలసదారులంటే ఇష్టం’’అని అన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement