తొలిరోజు మేడారానికి 450 బస్సులు | buses for medaram maha jatara | Sakshi
Sakshi News home page

తొలిరోజు మేడారానికి 450 బస్సులు

Jan 29 2018 4:41 PM | Updated on Oct 9 2018 5:58 PM

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన తొలి రోజు 450 బస్సులు నడిచాయి.

హన్మకొండ: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన తొలి రోజు 450 బస్సులు నడిచాయి. వరంగల్‌ నగరంతో పాటు, జిల్లాలోని ఇతర ప్రత్యేక పాయింట్లు, ఇతర జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాత్రి 8 గంటల వరకు 450 బస్సులు 1800 ట్రిప్పుల ద్వారా 72 వేల మంది భక్తులను జాతరకు చేరవేశాయని ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ తోట సూర్యకిరణ్‌ తెలిపారు.

భక్తుల రాక, సంఖ్యను బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వెంట వెంటనే పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement